KCR PK Meet: మరోసారి పీకేతో కేసీఆర్ భేటీ.. ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. ఇంతకుముందు వరంగల్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించారు. వరంగల్ డిక్లరేషన్ అంటూ సమరానికి సై అన్నారు. తాజాగా బీజేపీ నేత, బాద్ షా అమిత్ షా తెలంగాణలో పర్యటించారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరై సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దీంతో వాతావరణం మరింత రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో మరోమారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారనే వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పలుసార్లు సమావేశమై రాజకీయ అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ నెల 18న కేసీఆర్, ప్రశాంత్ కిశోర్ మరోసారి భేటీ అవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణలో తాజా పరిస్థితులపై ప్రశాంత్ కిషోర్ ఫోకస్ పెట్టారు. తాను పరిశీలించిన అంశాలను, అనుసరించాల్సిన వ్యూహాల గురించి కేసీఆర్‌కు పీకే నివేదిక ఇస్తారని తెలుస్తోంది.
Also Read
- Mir Alam Lake : మిర్ ఆలం చెరువుకు మహర్దశ.. హైదరాబాద్‌లో కొత్త టూరిజం హబ్
- Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
తెలంగాణలో వివిధ జిల్లాల్లో పార్టీ పరిస్థితి కొంత ఆందోళనకరంగా వుందని, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తం అవుతోందని పీకే వివరించనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల వివరాలను కేసీఆర్ కు పీకే వివరించనున్నారు. . కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో వీరు సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అమిత్ షా, రాహుల్ గాంధీ పర్యటన అనంతరం పరిస్థితిని కూడా వీరు చర్చించే అవకాశం వుందని తెలుస్తోంది.
MLA Methuku Anand:కార్పొరేట్ సంస్థల చేతుల్లో బీజేపీ స్టీరింగ్
తాజావార్తలు
-
India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్‌కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
-
Nepal Floods: నేపాల్‌లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
-
ICC: స్టార్ క్రికెటర్‌కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?