ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా వున్నారు సీఎం కేసీఆర్. సీఎం కేజ్రీవాల్ నివాసంలో కేసీఆర్ భేటీ ముగిసింది. గంటన్నర పాటు కేసీఆర్, కేజ్రీవాల్ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. అనంతరం చండీగఢ్ బయలు దేరారు సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్. కేసీఆర్ కారులోనే బయలు దేరారు కేజ్రీవాల్. ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చండీగఢ్‌కు పయనమయ్యారు.
గాల్వన్ వ్యాలీ అమరవీరుల జవానులకు నివాళులు అర్పించారు కేజ్రీవాల్, కేసీఆర్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్. అనంతరం రైతు ఉద్యమంలో చనిపోయిన 600 రైతు కుటుంబాలకు మూడు లక్ష రూపాయల చెక్కులు అందజేయనున్నారు కేసీఆర్. 600 కుటుంబాలకు కేసీఆర్ చేయూతనందిస్తారు. చండీగఢ్‌లోని ఠాగూర్ థియేటర్లో జరగనున్న ఈ కార్యక్రమంలో బాధిత రైతు కుటుంబాలతో పాటు స్థానిక నేతలు హాజరవుతున్నారు. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన సందర్భంలో కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.
ఈఉద్యమంలో పోరాడి మృతిచెందిన కర్షక కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ వారికి చెక్కులు అందచేస్తున్నారు. ఇప్పటికే పంబాజ్ ప్రభుత్వం.. రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు రూ.5 లక్షల పరిహారం అందించింది. పంజాబ్‌కు చెందిన ప్రతి జిల్లా వ్యవసాయ అధికారి.. ఉద్యమంలో మరణించిన వారి జిల్లాకు చెందిన రైతు కుటుంబాలను ఠాగూర్ థియేటర్‌కు తీసుకువచ్చారు. తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రి తమ రాష్ట్రానికి చెందిన రైతులకు భారీ పరిహారం చెల్లించడం పట్ల రైతు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
Varla Ramaiah: సుబ్రహ్మణ్యం హత్యపై సమగ్ర దర్యాప్తు జరగాల్పిందే