తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పరిస్థితి ఉప్పూ నిప్పులా ఉంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రజసంగ్రామ యాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రావడం ఆ పార్టీలో జోష్ మరింతగా పెంచింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.
ఇదిలా ఉంటే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. దళిత బంధు ఇస్తా, అంబేద్కర్ విగ్రహం పెడతా అని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజల కష్టాన్ని తీసుకుపోయి ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నాడని సీఎం కేసీఆర్ ను విమర్శించారు. సమతామూర్తి విగ్రహానికి నేనే ఖర్చు పెడుతున్నా అని చెప్పావు.. కనీసం ప్రధాన మంత్రి వస్తే కూడా కలవలేదని విమర్శించారు. ప్రధాని మన రాష్ట్రానికి వస్తుంటే నువ్వు ఇతర రాష్ట్రాలకు పోతున్నావని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని… పెట్రోల్, డిజిల్ రేట్లు తగ్గాయని.. రాష్ట్ర పరిధిలోని వ్యాట్ ను కూడా ప్రభుత్వం వెంటనే తగ్గించాలి బండి సంజయ్ డిమాండ్ చేశారు. అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి కేటీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఏం సంచలనం సృష్టిస్తారో ప్రజలకు తెలపాలని… కేసీఆర్ తో ఏం కాదూ అని సంజయ్ అన్నారు. తెలంగాణ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు రావడం లేవని.. కొండగట్టు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను కేసీఆర్ పరామర్శించ లేదని విమర్శించారు.