చామకూర మల్లారెడ్డి. 2018 ఎన్నికల్లో మేడ్చల్ నుంచి గెలిచి.. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఎమ్మెల్యేగా తొలిసారే గెలిచినా.. ఆయనకు కేబినెట్‌లో చోటుకల్పించారు సీఎం కేసీఆర్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి టికెట్‌ను తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి ఇప్పించుకున్నారు మల్లారెడ్డి. కానీ.. రేవంత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. అల్లుడి ఓటమి మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపించిందని పార్టీ వర్గాల్లో చర్చ సాగింది. దానికితోడు కార్మికశాఖ మంత్రిగా మల్లారెడ్డి పనితీరు బాగోలేదనే రిపోర్ట్స్ వెళ్లాయట. సీఎం కేసీఆర్ అసంతృప్తి…
ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలపై ప్రతి సారి అధికార పార్టీదే పై చేయి ఉంటున్న నేపథ్యంలో తాజాగా విపక్షాలు కూటమి అధికార పార్టీకి తలనొప్పిగా తయారైందని చెప్పొచ్చు. అయితే నేడు మరోసారి దేశరాజధాని ఢిల్లీలో భేటీ అయిన విపక్షాల కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించాయి. బీజేపీ నుంచి బయటకు వచ్చిన యశ్వంత్ సిన్హా ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే గత కొంత కాలంగా జాతీయ రాజకీయాల్లో…
సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులు మరో పోరాటంకి సిద్దం అవ్వండని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్దం అవ్వండని, పొడు భూములకు పట్టాలు ఇస్తారు అని నమ్మినము.. కానీ మోసం జరిగిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. పోడు భూములకు పట్టాలు ఇచ్చింది.. భూములు పంచింది కాంగ్రెస్సే అని ఆయన వెల్లడించారు. మిగిలి ఉన్న భూములకు కూడా పట్టాలు కాంగ్రెస్ ఇస్తుందని…
సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. ట్వట్టర్ వేదికగా.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ నిరంకుశ పాలనను సాగిస్తోందని, రాష్ట్రంలో ఏ పథకాన్నీ సరిగ్గా అమలు చేయడం లేదు. ఒక్కటి కాదు, రెండు కాదు… ప్రతి దానిలోనూ తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు విజయశాంతి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికి కోత పెట్టిన రాష్ట్ర సర్కారు… రూపాయికి కిలో బియ్యం కూడా సక్కగ ఇస్తలేదు. రేషన్ షాపులకు సకాలంలో బియ్యం సరఫరా చేయకపోవడంతో పేదల కడుపు…
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రాజీవ్ స్వగృహ భూములను వేలం వేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్‌లో రాజీవ్ స్వగృహ భూములను అక్రమంగా వేలం వేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆనాటి కాంగ్రెస్ సర్కార్ లబ్ధిదారుల నుంచి తీసుకున్న డిపాజిట్ నుంచి 2 కోట్లతో రైతుల నుంచి 67 ఎకరాలు సేకరించిందని, కోర్టు వివాదాల్లో ఉన్న భూములను కలెక్టర్ అడ్డికి పావుసేరు చొప్పున అమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. కోర్టు వివాదాలున్నా ..…
బాసర ట్రిపుల్ ఐటీలో ఏడు రోజులుగా విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో బాసర విద్యార్థుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అందులో.. బాసర ఐఐఐటీ విద్యార్ధులు ఎండకు ఎండుతూ వానకు తడస్తూ ఆందోళన చేస్తున్నారని, వాళ్ల సమస్యలు సిల్లీ అంటూ విద్యా శాఖ మంత్రి హేళనగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మరో వైపు మీ పుత్ర…
మీరు మరో ‘‘నిరో చక్రవర్తి’’ గా వ్యవహరిస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ రాసారు. బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్యలను తక్షణం పరిష్కారించాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ బాసరలోని ట్రిపుల్ ఐటి సంస్థ అని పేర్కొన్నారు. బాసరలోని ట్రిపుల్ ఐటి విద్యార్థులు గత ఆరురోజులుగా వేల మంది విద్యార్థులు వారి న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుందని తెలిపారు.…
* భారత్ బంద్ నేపథ్యంలో ఏపీలో అన్ని రైల్వే స్టేషన్లలో భారీ భద్రత * తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద భారీ బందోబస్తు. భారత్ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు. * నేడు ఛలో అనమర్లపూడికి పిలుపునిచ్చిన టీడీపీ. ఛలో అనమర్లపూడికి అనుమతి లేదంటున్న పోలీసులు. అనమర్లపూడిలో144 అమలులో ఉందంటున్న పోలీసులు. * ఆత్మకూరు ఎన్నికల నిర్వహణపై నెల్లూరులో అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా సమావేశం.…