CM KCR : మరోసారి కేసీఆర్ కి టీపీసీసీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హోం గార్డులు, మోడల్ స్కూల్ సిబ్బందికి జీతాల వెంటనే అందించాలని, తెలంగాణ ఆవిర్భావం నాడు రూ.16 వేల కోట్ల మిగులుతో, ధనిక రాష్ట్రంగా ప్రారంభమైన స్వరాష్ట్ర ప్రస్థానం ఎనిమిదేళ్ల మీ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్ధితికి చేరుకుందని ఆయన మండిపడ్డారు. విలువైన భూముల అమ్మకం, లక్షల కోట్ల అప్పులు… అది చాలదన్నట్టు ఇటీవల ప్రజలపై పలు రకాల పన్నుల భారం మోపారని ఆయన విమర్శించారు. ఒకవైపు అప్పుల ద్వారా, మరోవైపు భూముల అమ్మకం ద్వారా, మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో వ్యాట్ ద్వారా, కరెంట్ ఛార్జీల పెంపు ద్వారా, భూములు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ద్వారా, బస్ ఛార్జీల పెంపు ద్వారా, అడ్డు అదుపులేని మద్యం అమ్మకాల ద్వారా జనంపై ఎడాపెడా భారం మోపి, ముక్కుపిండి వసూలు చేస్తోన్న లక్షల కోట్ల సొమ్ములు ఎటుపోతున్నాయో, ఏ బడా కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరుతున్నాయో తెలియని పరిస్థితి. తెలంగాణ ధనిక రాష్ట్రం అని మీరే చెబుతారు. పక్క రాష్ట్రాలకు వెళ్లి పరిహారాలు పంచి వస్తారు. రూ.200 కోట్లు ఖర్చు చేసి దేశవ్యాప్తంగా పత్రికల్లో మీరేదో మహానేత అయినట్టు ప్రకటనలు ఇచ్చుకుంటారు. మీ పుత్రరత్నం విదేశీ పర్యటనల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు.
మరోవైపు అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా… శాంతిభద్రతల పరిరక్షణలో నిద్రాహారాలు మాని పని చేసే హోం గార్డులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వరు. మీ వింధులకు, విలాసాలకు, విదేశీ విహార యాత్రలకు వందల కోట్లు ఖర్చు చేసే మీరు…నెల జీతం వస్తే కాని పూట గడవని హోం గార్డుల కుటుంబాల పరిస్థితి గురించి ఒక్కసారైనా ఆలోచన చేశారా? సకాలంలో జీతాలు ఇవ్వకుంటే వాళ్ల కుటుంబాలు ఎలా గడుస్తాయని అనుకుంటున్నారు? కట్టు బానిసల కంటే ఘోరమైన స్థితిలో పని చేసే హోంగార్డుల విషయంలో మీకు కనీస కనికరం లేదా? జూన్ నెల కూడా ముగుస్తు్న్నా… ఇంత వరకు వారికి మే నెల జీతం కూడా ఇవ్వని మీ నిర్వాకాన్ని ఏమని ప్రశ్నించాలి? అదే సమయంలో మెడల్ స్కూళ్లలో టీచింగ్ – నాన్ టీచింగ్ సిబ్బంది జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి.
Also Read
వారు కూడా మే నెల జీతాల కోసం చెకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఈ వర్గాలన్ని పేద, మధ్య తరగతికి చెందిన వారే. నెల జీతమే వారికి ఆధారం. అట్లాంటి వారి జీతాలు, జీవాతాలతో చెలగాటం ఆడుతారా? వారికి నెల జీతం ఇవ్వలేని దుస్థితి మీ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? తొలకరి మొదలై… వానాకాలం పంటకు సమయం ఆసన్నమైనా ఇంత వరకు రైతు బంధు నిధులు కూడా విడుదల చేయలేదు. ఈ సారి రైతుబంధు ఉంటుందా… ఉంటే ఎప్పుడిస్తారు… అసలు ఇస్తారా లేదా అని పేద రైతులు ఎదురు చూస్తున్నారు. మీరేమో బీఆర్ఎస్… వీఆర్ఎస్ అంటూ ప్రజలకు కనిపించకుండా, అసలు రాష్ట్రంలోనే ఉన్నారో లేదో తెలియకుండా కాలక్షేపం చేస్తున్నారు. కనీసం ఆర్థిక మంత్రైనా పరిస్థితిని సమీక్షించి, సరిదిద్దుతాడేమో అనుకుంటే ఆయన మీ రాజకీయ ప్రేలాపనలకు కోరస్ పాడే పనిలో బిజీగా ఉన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం, రైతులకు రైతుబంధు నిధులు ఇంకా విడుదల చేయలేకపోవడం అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోంది.
రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ ఎంత గొప్పగా ఉందో తెలుస్తోంది. మీ దుష్టపాలనలో రాష్ట్ర ఖజానా దివాళీ తీసిందన్న విషయం అర్థమవుతోంది. అప్పులు తెచ్చుకుంటే తప్ప పూట గడవని దుస్థితికి రాష్ట్రాన్ని చేర్చారన్న విషయం తెలుస్తూనే ఉంది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయండి. మీ విలాసాలు, జల్సాలు, రాజకీయ విన్యాసాలు ఆపి చిరు ఉద్యోగులైన హోం గార్డులు, మోడల్ స్కూల్స్ సిబ్బందికి తక్షణం మే నెల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో ఆయా వర్గాలకు అండగా కాంగ్రెస్ కార్యచరణ ఉంటుంది అని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..