మెట్రో పిల్లర్లు కూడా టీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారు.. అధికారం ఉందని, డబ్బు ఉందని మీరు చేస్తున్న ప్రతి దానిని ప్రజలు గమనిస్తున్నారు.. వాళ్లు చీప్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు బీజేపీ నేత లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్ వేదికగా జరిగన ఈ కార్యక్రమంలో నేడు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఉజ్జల్ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. తెలంగాణ హైకోర్టు 2019 జనవరి 1న ఏర్పాటు…
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. రాజ్‌భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు.. సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.
నేడు రైతులకు పెట్టుబడి పైసలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సాయం డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. తొలిరోజు ఎకరం భూమి ఉన్న రైతులకు ఎప్పటిలాగే పైసలు పడనున్నాయి. క్రమపద్దతిలో రైతులందరికీ జమ చేయనున్నారు. అయితే.. ఈ ఏడాది కొత్తగా 3064లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందనుంది. అయితే గత సీజన్ తో పోల్చితే లబ్దిదారులైన రైతుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు నిధుల మొత్తం కూడా పెరిగింది. ఇప్పుడు ఈ వానకాలం సీజన్‌కు రైతుబంధుకు…
ఈనెల 28న(రేపు) రాజ్‌భవన్ లో హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో తెలంగాణ గరవ్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణం చేయించేది గవర్నర్.. కాగా రాజ్ భవన్ లో ఈ సాంప్రదాయం జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం.. ఉన్నతాధికారులు హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరలు హాజరవ్వాలి. అయితే గత కొంత కాలంగా…
హైదరాబాద్ ప్రతిష్ట పెంచేలా.. నగరం సిగలో మరో కలికితురాయి చేరబోతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి ‘టీ హబ్’ ను ఈ నెల 28న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘ భవిష్యత్తును అంచనా వేయడానికి ఉత్తమ మార్గం దానిని సృష్టించడం’’ అనే అబ్రహం లింకన్ వ్యాఖ్యలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ కు పెద్ద పీట వేస్తూ టీహబ్ కొత్త…
తెలంగాణలో రాక్షస, నయా నిజాం పాలన సాగుతోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ పార్టీ నుంచి సామ వెంకట్ రెడ్డి, నవతా రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు స్థానం లేదని.. ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో స్థానం కల్పించారని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచడానికి బీజేపీ కృషి చేస్తోందని ఆయన అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలకు భిన్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి…