Vijayashanti : కేసీఆర్‌పై ట్విట్టస్త్రాలు సంధించిన విజయశాంతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. ట్వట్టర్ వేదికగా.. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ నిరంకుశ పాలనను సాగిస్తోందని, రాష్ట్రంలో ఏ పథకాన్నీ సరిగ్గా అమలు చేయడం లేదు. ఒక్కటి కాదు, రెండు కాదు… ప్రతి దానిలోనూ తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు విజయశాంతి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికి కోత పెట్టిన రాష్ట్ర సర్కారు… రూపాయికి కిలో బియ్యం కూడా సక్కగ ఇస్తలేదు. రేషన్ షాపులకు సకాలంలో బియ్యం సరఫరా చేయకపోవడంతో పేదల కడుపు మాడుతోందని మండిపడ్డారు.. దీనికి తోడు సర్వర్ డౌన్, సిగ్నల్ ప్రాబ్లమ్స్, వేయింగ్, బయోమెట్రిక్ మెషీన్లు పనిచేయకపోవడం వంటి కారణాలతో… రాష్ట్రవ్యాప్తంగా వేలాది పేద కుటుంబాలు బియ్యం అందక తిప్పలు పడుతున్నయి. రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కానీ గడువును 20వ తేదీ వరకు పొడిగించినా… బియ్యం అందని పరిస్థితి నెలకొందని ఆమె విమర్శించారు.
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
ప్రభుత్వం తీరు వల్ల ప్రజలే కాదు, డీలర్లు కూడా నష్టపోతున్నరు. రేషన్ షాపులకు రావాల్సిన కోటాను ఆలస్యంగా ఇస్తుండడంతో డీలర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నయి. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి… 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ పూర్తి కాగానే… 20వ తేదీలోపు డీడీలు కట్టించుకుని, 30వ తేదీలోగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాలి. కానీ, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వల్ల ఇదంతా ఆలస్యమవుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్… పేదల కడుపు మీద కొట్టడం ఎంత వరకు సమంజసం? పేదలకు నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లాలంటే రేషన్ బియ్యామే శరణ్యం. కానీ పేద బతుకులతో కేసీఆర్ సర్కార్ ఆడుకుంటోందని ఆమె మండిపడ్డారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!