Banda Prakash : తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బండ ప్రకాశ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగింది. ముందుగా స్పీకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు సీఎం. అనంతరం పోడు భూముల విషయంలో సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy: ప్రజలు సీఎం కేసీఆర్ కు ఇచ్చిన అవకాశం ముగిసిందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రైతులకు 24 గంటల విద్యుత్ పై కేసీఆర్ ఆడంబరపు ప్రకటనలు ఇచ్చారని మండిపడ్డారు. ఆనాడు బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమంతో ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు. ప్రైవేటు విద్యుత్ సంస్థల్లో 50 శాతం కమిషన్లు దండుకున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.
Asaduddin owaisi: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తో ఎంఐఎం పొత్తు గురించి ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో చెప్పేందుకు ఇంకా టైం ఉందని అన్నారు. ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని అన్నారు.