Minister KTR: సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రేటర్ హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Jagga Reddy: కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అసెంబ్లీ హాల్ లో సీఎంని కలిశారు జగ్గారెడ్డి. సీఎంని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరడంతో, సీఎం ఛాంబర్ లోకి వెళ్లిన తరువాత జగ్గారెడ్డిని పిలిచారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులు, పథకాల కోసం సీఎంని కోరారు. సంగారెడ్డి వరకు మెట్రో రైలు వేయాలని కోరారు.
ప్రగతి భవన్ పెల్చివేయలని రేవంత్ దుర్మార్గంగా మాటలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానమా? రాష్ట్ర అధ్యక్షులు అలా మాట్లాడొచ్చా ? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. మీ పార్టీ అధ్యక్షుడుకి మీకు శృతి ఉందా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Off The Record: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యారు. సిట్టింగ్ ఎంపీగానే ఉన్నప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఓపిగా ఉన్న ఆయన బీఆర్‌ఎస్‌ను వదిలేయాలని డిసైడ్ అయ్యారు. పొంగు లేటి వర్గాన్ని బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తోంది. దమ్ముంటే తనపై వేటు వేయాలని మాజీ ఎంపీ అధికారపార్టీని సవాల్ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. ఇల్లెందు, అశ్వారరావుపేట, వైరా అభ్యర్థులను ప్రకటించేశారు. అయితే, పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారనే…
శాసన మండలి మీడియా పాయింట్ లో రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో ప్రగతిభవన్ ను పేల్చివేయాలని వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీలు అందరూ కలిసి డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
ట్యాక్స్ రెవెన్యూ 40 వేళా కోట్లు చూపెట్టారని, దీనిపై ట్యాక్స్ వేశారా... వేయాలని ఆలోచిస్తున్నారా..?అంటూ శాసనమండలిలో బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. దేశ సంపద దోపిడీకి గురి అవతోందని ఆగ్రహంమం వ్యక్తం చేశారు. 41 వేల కోట్లు గ్రాంట్స్ అంచనా వేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 8 వేల కోట్లు దాటలేదన్నారు.
ఇవాళ ఉభయసభల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ జరగతుంది. శాసనభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా బడ్జెట్‌పై చర్చ చేపడతారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పై చర్చ జరపనున్నారు.