Kamareddy: రాష్ట్రంలో మరో కొత్త మండలం..ఉత్తర్వులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamareddy: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మరో కొత్త మండలాన్ని ప్రకటించింది. కామారెడ్డి జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటైంది. మాచారెడ్డి మండల పరిధిలోని పాల్వంచను కొత్త మండలంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆరు నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. స్థానిక ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం ప్రకటించింది. కొన్ని నెలల క్రితం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు మండలాలు ఏర్పాటై ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పాల్వంచ మండల ఏర్పాటు ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలోని 9 గ్రామాలు, రామారెడ్డి మండలంలోని ఒక గ్రామాన్ని కొత్తగా పాల్వంచ మండలంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో 10 గ్రామాలతో పాల్వంచ మండలం ఏర్పడింది. తాజా మండలంతో కామారెడ్డి జిల్లాలో మండలాల సంఖ్య 24కు చేరింది.దీంతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం నుంచి తొమ్మిది గ్రామాలను విడదీసి ‘ఎర్రవల్లి’ పేరుతో కొత్త మండలం ఏర్పాటైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో కామారెడ్డి జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లాలోని కొత్త మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో మొత్తం 24 మండలాలు ఉన్నాయి..
Also Read
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
1 బాన్సువాడ, 2 బీర్కూర్, 3 బిచ్కుంద, 4 జుక్కల్, 5 మద్నూర్, 6 నిజాంసాగర్, 7 పిట్లం, 8 నస్రుల్లాబాద్, 9 పెద్ద కొడప్‌గల్, 10 కామారెడ్డి, 11 భిక్నూర్, 12 రాజంపేట్, 13 దోమకొండ, దోమకొండ, 14 మాచారెడ్డి, 15 రామారెడ్డి, 16 బీబీపేట్, 17 తాడ్వాయి, 18 సదాశివనగర్, 19 యోల్లారెడ్డి, 20 గాంధారి, 21 లింగంపేట్, 22 నాగారెడ్డిపేట, 23 డోంగ్లి, 24 పాల్వంచ.
Kamareddy: రాష్ట్రంలో మరో కొత్త మండలం..ఉత్తర్వులు జారీ
తాజావార్తలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్‌లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్‌కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!