సిద్దిపేటలో దివ్యాంగులకు సభా వేదికగా క్షమాపణలు చెప్పారు మంత్రి హరీష్ రావు. అధికారుల అత్యుత్సాహంతో ప్రేమ పొందే చోట అధికారుల పుణ్యమా.. అని నేను తిట్లు తింటున్న వికలాంగుల ఉసురు పోసుకోవద్దన్న మంత్రి వ్యాఖ్యానించారు. సిద్ధిపేట బాల సదనంలో 150 మంది శారీరక దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. అయితే.. మధ్యాహ్నం 3 గంటలకు కార్యక్రమం ఉంటే ఉదయం 10 గంటలకే 150 మందిని అధికారులు తీసుకువచ్చారు. విషయం తెలియడంతో అధికారులను మందలించి మంత్రి హరీష్ రావు.. వికలాంగులకు క్షమాపణలు చెప్పారు. ఇదిలా ఉంటే.. సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
Also Read : Gopal Italia: గుజరాత్ లో ఆప్ నేత అరెస్ట్.. భయం లేదన్న ఇటాలియా
ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే.. ఈ క్రమంలోనే.. ఓ చిన్నారి కుర్రో.. కుర్రు.. సోది చెప్తానమ్మ సోది.. అంటూ హరీష్ రావుకు జాతకం చెప్పింది. హరీష్ రావు గురించి చెప్తూ.. అందరి ముఖాల్లో నవ్వులు పూయించింది ఆ చిన్నారి. అసెంబ్లీ టైగర్ అయినా.. ట్రబుల్ షూటర్ అయినా హరీష్ రావే అంటూ సోది చెప్పింది చిన్నారి. 20 ఏళ్లకే మామా కేసీఆర్ దగ్గర రాజకీయాలు నేర్చాడంటూ.. చిన్ననాటి నుంచి నాయకుడిగా ఎదిగిన తీరును చెప్పుకొచ్చింది చిన్నారి. అయితే.. సిద్దిపేట గడ్డపై ఇంతవరకూ ఎవ్వరూ చేయలేని అభివృద్ధిని చేశారని సోదిలో వివరించిన చిన్నారి.. దేశానికి కేసీఆర్ పీఎం అయితే.. తెలంగాణకు సీఎం కాబోయేది హరీష్ రావే అని చెప్పడంతో.. ఒక్కసారిగా.. సభలో నవ్వులు పూశాయి. అంతేకాకుండా.. కార్యకర్తలు సీఎం.. సీఎం.. అని నినదించడంతో.. ప్రాంగణమంతా.. మార్మోగింది.
Also Read : Shyam Rangeela: మోడీ గెటప్‌లో హాస్యనటుడు.. నిబంధనలు ఉల్లంఘించినందుకు నోటీసు