సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావ్ పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ఓ చిన్నారి హరీశ్ రావు దగ్గరకు వచ్చి ఆయనకు సోది చెప్పింది.
kishan reddy: విశాఖ స్టీల్ ఫ్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత వారం రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామని సింగరేణి ఆధికారులను ఆఘమేఘాల మీద అక్కడికి పంపించి రాజకీయ డ్రామాకు తెరతీశారన్నారు.
హుజూరారాబాద్, మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వందల కోట్లు ఎక్కడివి? అని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వాఖ్యలు చేశారు. నా మాటలపై అబిడ్స్ లో లేదా హుజురాబాద్ చర్చ పెట్టుకుందామా అని సవాల్ విసిరారు. నువ్వు వస్తావా? నీ బానిసలు వస్తారా? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay: ఈడీ వస్తుందంటే కాలు విరుగుతుంది, సీబీఐ వస్తుందంటే దుబాయి వెళ్తారు, ఇలాంటి నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్ లో జరిగిన నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై పలు విమర్శలు గుప్పించారు. ఇదే వరంగల్ గడ్డపై తనను అరెస్ట్ చేశారని, కేసీఆర్ కి బలగం కేవలం కొడుకు, కూతురు, అల్లుడే అని, బీజేపీకి బలగం తెలంగాణ ప్రజలని…
తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తాము వ్యతిరేకం కాదని..