కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అని మరోసారి విమర్శలు గుప్పించారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ఇవాళ ఆయన నిర్మల్ జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇచ్చింది లేదని విమర్శించారు. నిర్మల్ మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ను కోరతామన్నారు. స్వంత నిధులతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Acrobat : జిమ్నాస్టిక్ చేస్తు 30 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన భార్య.. మరి భర్త పరిస్థితి..?
అంతేకాకుండా.. బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. నిర్మల్ జిల్లాలో త్వరలోనే సీఎం కేసీఆర్ పర్యటించనున్నట్లు ఆయన వెల్లడించారు. పార్టీలు శాశ్వతం కాదని, ప్రజలే అంతిమ నిర్ణేతలు అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం చించోలి-బి సమీపంలోని వొకేషనల్ సెంటర్ ఏర్పాటుపై బీజేపీ నేతలు నానా రాద్దాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే.. ఈద్గాతో పాటు వృత్తివిద్యా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారని, గతంలో దేవాలయాల నిర్మాణానికి కూడా స్థలం కేటాయించారని తెలిపారు మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి.
Also Read : Chiranjeevi: జగదేకవీరుడు- అతిలోక సుందరి సీక్వెల్ అయితే కాదుగా..?