Harish Rao: మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చౌటుప్పల్ ఆస్పత్రితో పాటు నియోజకవర్గంలోని 4 పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం చౌటుప్పల్‌లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి హరీశ్‌రావు, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ 36 కోట్లతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నామన్నారు. గతంలో ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలోని చౌటుప్పల్ ఆసుపత్రి, 4 పిహెచ్ సిలను అప్ గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో తెలంగాణలో ఒక్క మెడికల్ కాలేజీలు మంజూరు కాలేదన్నారు. గత ప్రభుత్వాల హయాములలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రిలో దిక్కయ్యాయని తెలిపారు. వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలకు నీతి ఆయోగ్ ప్రశంసలు అందిస్తుందని అన్నారు మంత్రి. బస్తీ దావఖానాలు ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.
Read also: Sandra Venkata Veeraiah: పొంగిపోకు పొంగులేటి.. అంతా నీ వాళ్లు కాదు.. సండ్ర సెటైర్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెరిగిందని అన్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు గర్భిణీ స్త్రీలకు ఏప్రిల్ నెల ఆఖరు నుండి అందజేస్తున్నామన్నారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా పారామెడికల్ కాలేజీలను కూడా ప్రారంభించబోతున్నామన్నారు. నల్లగొండ, సూర్యపేట జిల్లాలో త్వరలో రేడియాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ప్రభుత్వం తరఫున కీమోథెరపీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయన్నారు. నిమ్స్ ఆస్పత్రిని అప్డేట్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. మెడికల్ కాలేజీలు లేని జిల్లాలలో వచ్చే సంవత్సరం మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వచ్చే ఏడాది మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామన్నారు. తెలంగాణలో పెరిగిన మెడికల్ కాలేజీల నేపథ్యంలో తెలంగాణ పిల్లలు విదేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అనేవాళ్ళు విమర్శలు చేయడానికే మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చౌటుప్పల్ 100 పడకల ఆసుపత్రికి 36 కోట్లతో టెండర్ ప్రక్రియ పూర్తయిందని అన్నారు. ఈ ఆస్పత్రిలో క్రిటికల్ సేవలు అందుబాటులోకి ప్రతిష్టాత్మకంగా తీసుకు వస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Flyovers closed in Hyderabad: నెక్లెస్ రోడ్ క్లోజ్.. ఫ్లై ఓవర్లు బంద్.. పోలీసుల ప్రకటన