మరోసారి తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. కొత్తగూడెం నియోజకవర్గం సుజాతానగర్‌లో రైతుగోస ధర్నాలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డిఅనే ఒక ఎమ్మెల్సీ ఉన్నారు.. వరి ధాన్యం కొంటున్నాం కదా ఎవరు మాట్లాడకూడదు అంటున్నాడట.. టీఆర్ఎస్ని ఏమైనా అంటే వరి కంకులతో కొట్టమని చెప్పాడట అంటూ మండిపడ్డారు. ఇక, తప్పులు చేస్తున్న కేసీఆర్‌ని దేంతో కొట్టాలి అని ప్రశ్నించారు…
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులకు కీలక సూచలను చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఏప్రిల్ 27న హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో నిర్వహించనున్న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దయచేసి కేవలం ఆహ్వానాలు ఉన్నవారు మాత్రమే రావాలి, వారికి పాస్‌లు అందజేస్తాం అన్నారు.. దాదాపు మూడు వేల మంది ప్రతినిధులు హాజరవుతారు.. మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎంపీలు,…
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరపనున్నారు. పార్టీ 22వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ఇతర మండలస్థాయి ప్రతినిధులకు ఆహ్వానం ఉంటుంది. ఇటు ప్రత్యేక ఆహ్వానితులుగా.. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. Read Also: COVID 19: కరోనాకు కొత్త మందు.. స్ప్రేతో…
వానాకాలం సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కోటి 42 లక్షల ఎకరాలలో వానాకాలం సాగు జరిగే అవకాశం ఉందన్నారు. 70 నుండి 75 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు, 50 లక్షల ఎకరాలలో వరి, 15 లక్షల ఎకరాలలో కంది, 11.5 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గత ఏడాది పత్తి వేయకుండా రైతులు నష్టపోయారని…
మే 6,7 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణకి వస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు భరోసా ఇవ్వడం కోసం రాహుల్ గాంధీ వస్తున్నారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఇక్కడ బాధ పడుతున్న వర్గాలకు అండగా ఉండాలని నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. రైతులు కల్లాల్లో గుండె ఆగి చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామాలు వేశాయని ఆయన మండిపడ్డారు. వరి వేస్తే ఉరి అని…
మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నేడు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మూడవరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బోరవెల్లి గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను సీఎం కేసీఆర్ ప్రశాంతంగా ఉండనివ్వడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలతో…
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామా రెడ్డి గూడెంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్ట మొదటి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రైతు బంధు చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. గోదావరి నీటిని మన ఇండ్లకు, పొలాలకు తెచ్చిన ఘనత మహానుభావుడైన సీఎం కేసీఆర్ ది. కాంగ్రెస్, బీజేపీ లు నీళ్ళ కోసం అలమటిస్తున్న ప్రజలని ఏనాడూ…
కొంతకాలం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ధ్వజమెత్తుతోన్న సంగతి తెలిసిందే! అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు వస్తోన్న తరుణంలో, ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని సిద్ధం చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే! బీజేపీయేతర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో పలుసార్లు సమావేశమయ్యారు. ఇక జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు వస్తుండడంతో.. ప్రతిపక్ష కూటమి అభ్యర్థిని…
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లాలో దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలు అందిస్తూ ట్రాక్టర్, కారు నడిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లాలో దళిత బంధు పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ గ్రౌండ్ లో జరిగిన యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్ సుధీర్ రెడ్డి, జడ్పీ…