ప్రధాని నరేంద్ర మోడీ చెప్పేవన్నీ గాలి మాటలు మాత్రమే.. పెంచిన గ్యాస్ ధరలకు మోడీకి దండం పెట్టాలన్నారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటిసారిగా నర్సంపేట నియోజకవర్గంలో పైపుల ద్వారా ఇంటింటికీ నేచురల్ గ్యాస్ పంపిణీ ప్రారంభించాం.. నర్సంపేటలో తక్కువధరకు 12,600 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం.. ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచిన నర్సంపేటలో అభివృద్ధి చూపించిన ఘనత…
తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరుగుతూ పోతోంది.. గవర్నర్ తమిళిసై మీడియాతో ప్రభుత్వంపై విమర్శలు చేయడం, తనకు అవమానం జరిగిందంటూ వ్యాఖ్యలు చేయడం లాంటి ఘటనలు దూరం పెంచుతూ పోతున్నాయి.. ఇదే సమయంలో గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందేనని.. అధికార టీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అవుతున్నాయి విపక్షాలు. అయితే, గవర్నర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్న…
టీఆర్ఎస్ పార్టీ నేతల వ్యవహారాలు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి. ఒకటి తర్వాత.. వరుసగా జరుగుతున్న ఘటనల్లో గులాబీ నేతలకు సంబంధాలు ఉండటం ఆ పార్టీకి తలనొప్పిగా పరిణమించింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో జరిగిన మూడు వ్యవహారాలు టీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక… టీఆర్‌ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. రామాయంపేటకు చెందిన తల్లికొడుకులు ఆత్మహత్య చేసుకోవడం… సెల్ఫీ వీడియో మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ పేరు చెప్పడం… రాష్ట్రవ్యాప్తంగా దుమారం…
ప్రగతి భవన్‌లో మంగళవారం సీఎ కేసీఆర్ వ్యవసాయరంగంపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. యాసంగి ధాన్య సేకరణపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా భారతదేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. రైతుల సంక్షేమం కోసం కార్యాచరణను మరింత పటిష్టంగా కొనసాగిస్తామన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్‌కు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడం, వానాకాలం వ్యవసాయ…
దళితులు ఆర్థికంగా సామాజికంగా ఉన్నతంగా స్థిరపడాలని, పారదర్శకంగా దళిత బంధును అందజేస్తున్నామన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప పథకం దళితబంధు అని ఆయన కొనియాడారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని ముందుకు వెళ్తుందని, దళిత బంధు కోసం బడ్జెట్లో 17800 కోట్లు కేటాయించామని ఆయన వెల్లడించారు. దళిత బంధుతో దళితులు ఆర్థికంగా సామాజికంగా ఉన్నతంగా ఎదగాలని మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు. సంగారెడ్డి పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన దళిత…
ఈ నెల 27న టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో నేడు రంగారెడ్డి జిల్లాలోని కందకూరు మండలంలో టీఆర్‌ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి భారీ ఎత్తున టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు హజరై ప్లీనరీని విజయవంతం చేయాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు నిందలు…
మెటావర్స్..! టెక్ ప్రపంచంలో ఇదే లేటెస్ట్ ట్రెండ్. సరికొత్త సాంకేతిక మాయాలోకం. కంప్యూటర్‌పై సృష్టించిన కల్పిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించే వేదిక. ఫిజికల్ గా మన ప్రసెన్స్ లేకపోయినా… అవతార్‌ల రూపంలో లైవ్ ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు. చర్చలు.. సమావేశాలే కాదు.. రోజువారీ భౌతిక ప్రపంచంలో చేసే పనులన్నీ మెటావర్స్ వేదికగా చేసుకోవచ్చు. ఈ లేటెస్ట్ టెక్నాలజీని తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి వినియోగించుకుంది. రాష్ట్ర ఐటీ శాఖ కొత్తగా రూపొందించిన తెలంగాణ స్పేస్‌టెక్ పాలసీ ఆవిష్కరణకు మెటావర్స్…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో కలిసి పనిచేయడం చాలా కష్టమని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయిన సీఎంలు నియంతలుగా మారుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఇద్దరు సీఎంల దగ్గర పనిచేస్తున్నా.. ఇద్దరూ భిన్నమయిన వ్యక్తులని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ పదవిలో వున్నా ప్రజలకు సేవచేయడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రోటోకాల్ అంశాన్ని కేంద్రం చూసుకుంటుందని ఆమె వెల్లడించారు. అయితే ఆమె ప్రస్తుతం ఢిల్లీ…
కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ సెక్రటేరియట్ పనులను మంగళవారం నాడు సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రగతి భవన్ నుంచి సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ పనులను పర్యవేక్షించారు. ఆరు అంతస్థుల సెక్రటేరియట్ నిర్మాణ పనులు పూర్తవగా.. వారం రోజుల క్రితం సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ పనులను పరిశీలించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో ఈ కార్యక్రమం రద్దు కావడంతో నేడు సెక్రటేరియట్‌ను సీఎం కేసీఆర్ సందర్శించారు. సెక్రటేరియట్ లో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి…