రైతుల ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలని, కేసీఆర్ కుటుంబంపై ఈడీ విచారణ జరపాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ డిమాండ్ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రౌడీ గా మారిపోయి పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏడేళ్ల నుంచి రాష్ట్ర సమితి రాబందుల సమితి గా మారిందన్నారు. పోలీసు యంత్రాంగంను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్ట్ లు, ప్రశ్నించే…
తెలంగాణలో అమ్మాయిలపై, మహిళలపై టీఆర్‌ఎస్ నేతలు ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజిని కుమారి నిప్పులు చెరిగారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అకృత్యాలు, ఆగడాలు, అమానుష ఘటనలు జరుగుతున్నాయని, టీఆర్‌ఎస్ నేతలు లైసెన్స్డ్ గుండాలు గా వ్యవహరిస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిలు ఎలా కనిపిస్తున్నారు మీకు… భార్యలను తీసుకురమ్మని అంటున్న సిగ్గు శరం లేని నేతలు…
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసిన తెలంగాణ ప్రభుత్వం.. చివరకు తామే కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.. ఢిల్లీ వేదికగా కేంద్రానికి డెడ్‌లైన్ పెట్టిన తర్వాత రోజు.. కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. తామే వరి కొనుగోలు చేసేందుకు సిద్ధమై.. దానిపై ప్రకటన చేశారు.. ఇక, మరుసటి రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి.. ఈ నేపథ్యంలో.. ఇవాళ వరి కొనుగోళ్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు…
సంగారెడ్డి పట్టణ కేంద్రంలో దళిత యూనిట్లను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు దేశానికి ఆదర్శమని కొనియాడరు. రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు ప్రతిపక్ష నాయకులకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఓట్లు తప్ప ప్రజల అభివృద్ధి అవసరం లేదని ఆరోపించారు. దమ్ము, ధైర్యం ఉంటే కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌లతోపాటు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో దళిత బంధును అమలు చేయండని…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నేడు 5వ రోజు జోగులాంబ జిల్లాలోని ఇటిక్యాల మండలంలో బండి సంజయ్ యాత్ర కొనసాగుతుండగా టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్ శ్రేణులు బీజేపీ కార్యకర్తలపై దాడికి యత్నించినట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ శ్రేణులు మద్యం సేవించి యాత్రను…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం భువనగిరి మండలం తుక్కపురం గ్రామంలోని పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతానికి చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. విద్యతో మనిషుల జీవితాల్లో వెలుగు నింపవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజనులకు, దళితులకు, బలహీన వర్గాలతో పాటు మైనార్జీలకు…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో నేడు 5వ రోజుల జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఇటిక్యాల మండలం వేముల నుంచి పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంలో టీఆర్ఎస్ శ్రేణులు పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో కొంత మంది కార్యకర్తలు కిందపడిపోయారు. పోలీసులు రంగంలోకి…
తెలంగాణలో111 జీవో రద్దు హాట్ టాపిక్ అవుతోంది. ఇంత హడావిడిగా ఎందుకు జీవో రద్దుచేయడం ఎందుకని అడిగితే.. సీఎంకి ధన్యవాదాలు తెలపాలన్నారు. గతంలో అంతా ఎన్నికల హామీగా మారిపోయింది. సీఎం దీనిని రద్దుచేయడం అభినందనీయం. 111 జీవో వల్ల రైతులు భూములు అమ్ముకోలేరు. బ్యాంక్ లోన్లు, ఇల్లు కట్టుకోలేరు. రైతులకు సీఎం కేసీఆర్ ఎంతో మేలుచేశారన్నారు మంత్రి సబిత. చీకటి నుంచి మనం వెలుగులోకి వచ్చాం. 25 సంవత్సరాల నుంచి వున్న జీవో ఇది. ఈ జీవో…
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు కుమ్మక్కై బీజేపీ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజల మృతికి కారకులవుతున్నారని, పోలీసులు తమ పోలీస్ యూనిఫాం వదిలేసి గులాబీ కండువా కప్పుకోవాలని బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. రామాయంపేట్ లో తల్లి కొడుకుల ఆత్మహత్య, ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త మృతిపై డీకే అరుణ స్పందిస్తూ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేస్తున్న…
తెలంగాణలో వరి కొనుగోలుకి సంబంధించి బీజేపీ-టీఆర్ఎస్ మాటల యుద్ధం చేస్తున్నాయి. రెండుపార్టీల వైఖరిపై తెలంగాణ జనసమితి నేత ఫ్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఇద్దరూ అలా గొడవపడితే ఎలా? పరిష్కారం చేయకుంటే తప్పుకోండి. కేంద్రం బాధ్యత నుంచి తప్పించుకోలేదు. కేంద్రం-రాష్ట్రం వివాదాల్లో గవర్నర్ కి టార్గెట్ చేశారు. గవర్నర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది. గవర్నర్ వ్యవస్థని అగౌరవపరిస్తే తమను తాము అవమానించుకోవడమే. రాజ్యాంగ వ్యవస్థ గౌరవం కాపాడాలి. గవర్నర్ బీజేపీ నేతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల విషయంలో…