టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులకు కీలక సూచలను చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఏప్రిల్ 27న హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో నిర్వహించనున్న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దయచేసి కేవలం ఆహ్వానాలు ఉన్నవారు మాత్రమే రావాలి, వారికి పాస్‌లు అందజేస్తాం అన్నారు.. దాదాపు మూడు వేల మంది ప్రతినిధులు హాజరవుతారు.. మంత్రులు, ఎమ్యెల్యేలు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రజాప్రతినిధులు వస్తారన్న ఆయన… సభలో పార్టీ, రాజకీయ తీర్మానాలు ఉంటాయని వెల్లడించారు.
Read Also: Jagga Reddy: పువ్వాడ ఓ సైకో.. వెంటనే బర్తరఫ్ చేయాలి..
తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి ప్రతీకగా టీఆర్ఎస్ పార్టీ పుట్టిందని తెలిపారు మంత్రి కేటీఆర్.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సభ జరుగుతుందని.. టీఆర్ఎస్ పార్టీ 22 ఏళ్లలోకి అడుగుపెడుతుంది.. కావున 21వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం అన్నారు.. రేపు హైదరాబాద్ నగర ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తాం, సభకు సంబంధించిన విషయాలు చర్చిస్తామని.. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.