విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి మూలా నక్షత్రం సందర్భంగా ఆరో రోజు అయిన నేడు (శుక్రవారం) కనకదుర్గదేవి సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మూలా నక్షత్రం కానున్న నేపథ్యంలో కనక దుర్గ అమ్మవారిని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం పర్యటన అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
Read Also: Sivaji: అయ్యో.. శివాజీని ఏడిపించేస్తున్నారే
అయితే, సీఎం జగన్ దర్శనం తర్వాత వేద పండితుల చేత వేద ఆశీర్వచనం తీసుకున్నారు.. అనంతరం సీఎం జగన్ కు అమ్మవారి లడ్డు, ప్రసాదం,శేష వస్రం, చిత్రపటాన్ని ఆలయ అధికారులు అందించారు. సీఎంకు ఆశీర్వచనం ప్రారంభం అవగానే సామాన్యులను క్యూలైన్ లలో దర్శనానికి పంపిన అధికారులు.. సీఎం ఆజ్ఞ ప్రకారం సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనానికి పెద్దపీట వేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇక, సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో భద్రత చర్యలపై జిల్లా అధికార యంత్రాంగం.. వివిధ శాఖల అధికారులతో కలిసి ఇంద్రకీలాద్రిని పరిశీలించింది. పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పరిశీలించారు. ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా.. భక్తులకు అసౌకర్యం కలగకుండా.. ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీపీ కాంతి రాణా టాటా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతా సిబ్బంది సమక్షంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ నిర్వహించారు. సీఎం కాన్వాయ్ దిగిన నుంచి ఇంద్రకీలాద్రిపైకి సాఫీగా చేరుకునేలా భద్రతను ఏర్పాటు చేశారు.