ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. జగనన్న చేదోడు పథకం లబ్ధిదారుల అకౌంట్లోకి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 25వేల లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనుంది. రజన, నాయి బ్రాహ్మణ, టైలరింగ్ చేసే వారికి ప్రభుత్వం చేయూత అందించనున్నారు. ఒక్కొక్కరికి 10 వేల రూపాయల ఆర్ధిక సాయం జగన్ సర్కార్ చేస్తుంది. 325 కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాల్లో ముఖ్యమంత్రి జమ చేయనున్నారు.
Read Also: NZ vs AFG: 7 క్యాచ్‌లు మిస్.. తగిన మూల్యం చెల్లించుకున్న ఆఫ్ఘాన్..
రేపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు కార్యక్రమాన్ని వర్చువల్ గా లబ్దిదారుల ఖాతాల్లో నగదును సీఎం జగన్ జమ చేయనున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ పథకం కింద ప్రభుత్వం మొత్తం 1252.52 కోట్ల రూపాయలు అందించింది. అయితే, సీఎం జగన్ మోహన్ రెడ్డి. రేపు ( గురువారం ) ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలు దేరి వెళ్లనున్నారు. ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులను రిలీజ్ చేయనున్నారు. ఇక, ఈ కార్యక్రమం అనంతరం తాడేపల్లికి సీఎం జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.
Read Also: Bhatti Vikramarka: బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి..
అయితే, ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మూడు విడతల్లో కలిపి 30,000 రూపాయలు చెల్లించింది. ఇప్పుడు నాలుగో విడత డబ్బులు ఖాతాల్లో జమ చేయనుంది. మొత్తం ఐదేళ్లలో 50,000 వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. సీఎం జగన్ చేతుల మీదుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి 10,000 వేల రూపాయల బదిలీ కానున్నాయి. బటన్ నొక్కి అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగింది.