నేను ఉన్న పార్టీ జెండా ఎగరాలని కోరుకున్నాను..
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఓ ప్రైవేట్ పంక్షన్ హల్ లో కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ జన్మదిన వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి నియోజకవర్గం కిర్తి ప్రతిష్ట నిలిపిన ప్రజలందరికి ధన్యవాదాలు చెప్పారు. నన్ను అక్కున చేర్చుకున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాడటానికి ప్రాధాన్యత గల నియోజకవర్గం సత్తుపల్లి.. గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటు పడ్డాను.. నేను ఉన్న పార్టీ జెండా ఎగరాలని కోరుకున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు. సత్తుపల్లి ప్రజలు ధైర్యవంతులు.. రాగమయి గెలుపుతో సత్తుపల్లి సత్తా చూపించారు.. ప్రభుత్వ కార్యక్రమాలు ఏం చేపట్టిన సత్తుపల్లిలోనే ముందుగా చేపడతాను అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
సీఎం జగన్‌ను కలవనున్న వైఎస్ షర్మిల.. ఎమ్మెల్యే ఆర్కే ఆసక్తికర వ్యాఖ్యలు..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో ఈ రోజు భేటీ కానున్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసంలో ఆయన్ని కలవనున్నారు సోదరి షర్మిల.. అయితే, చాలా గ్యాప్ తర్వాత అన్నా చెల్లెలు కలవనుండడం.. అది కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేముందు.. ఆయన్ని కలిసి వెళ్తుండడంతో.. ఫ్యామిలీ మీటింగే అయినా.. రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.. ఇక, ఇప్పటికే ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి.. తన ప్రయాణం వైఎస్ షర్మిలతోనే అని ప్రకటించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక, వైఎస్ జగన్‌తో సమావేశంపై ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇజ్రాయిల్ దాడిలో హమాస్ డిప్యూటీ చీఫ్ హతం.. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధమని వార్నింగ్..
హమాస్ నాయకత్వాన్ని తుడిచిపెట్టే దిశగా ఇజ్రాయిల్ కదులుతోంది. తాజాగా హమాస్ డిప్యూటీ చీఫ్ సలేహ్ అల్-అరౌరీని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చంపేసింది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఉన్న అల్-అరౌరీపై దాడి చేసి హతమార్చింది. మంగళవారం జరిగిన ఈ ఘటన మరోసారి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. మరోవైపు ఈ దాడిని లెబనాన్ ప్రధాని ఖండించారు. మరోవైపు ఇతని మరణానికి హమాస్‌తో పాటు హిజ్బుల్లా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించాయి.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ ఆర్మీ చీఫ్ ప్రతినిధి డేనియల్ హగారి ఈ దాడిపై నేరుగా వ్యాఖ్యానించలేదు. అయితే, ఇజ్రాయిల్ సైన్యం ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉందని అన్నారు. తొలిసారిగా ఇజ్రాయిల్ గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో దాడుల తర్వాత లెబనాన్ రాజధాని బీరూట్‌పై దాడి చేసింది. ఈ దాడి ఆ ప్రాంతంలో సంక్షోభాన్ని మరింత పెంచడమే కాకుండా, యుద్ధం విస్తరించేందుకు అవకాశం ఉందని పాశ్చాత్య దేశాలు భయపడుతున్నాయి.
మోసాలు చేసి కుటుంబాలను చీలుస్తారు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
కాకినాడ జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మరి కుట్రలకు తెరతీస్తారంటూ ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఎక్కువగా పొత్తులు పెట్టుకుంటారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు.. మీరందరూ అలర్ట్ గా ఉండాలి.. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు అని ఆయన అన్నారు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే అని పేర్కొన్నారు.
పురంధేశ్వరి టీడీపీ బీ-టీం.. ఆమె మాటలకు విలువ లేదు..
టీడీపీ, చంద్రబాబుకు వైసీపీని చూస్తే ఎందుకు అంత భయమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. వైసీపీ ఇంఛార్జ్‌లను మార్చుకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. పురంధేశ్వరి టీడీపీ బీ టీం అన్న మంత్రి.. ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే స్థితికి పురంధరేశ్వరి వెళ్ళిందని.. కారంచేడులో దళితులు ఎంత మంది చనిపోయారో తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు. అప్పుడు ఏమైపోయావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి పవన్‌కళ్యాణ్‌కు ఆహ్వానం
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి రావాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందింది. బుధవారం మధ్యాహ్నం పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌కు ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ముళ్లపూడి జగన్ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ భేటీలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ఆర్.ఎస్.ఎస్ కార్యాలయ ప్రముఖ్ శ్రీ పూర్ణ ప్రజ్ఞ పాల్గొన్నారు. ఆహ్వాన పత్రిక అందించి అయోధ్య రామ మందిర నిర్మాణ విశేషాలు తెలిపారు. ఇదిలా ఉండగా.. 2024 జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు తరలిరానున్నారు. రజనీకాంత్‌తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, రతన్‌టాటాలకు కూడా ఆహ్వానం అందింది. జనవరి 22 మధ్యాహ్నం 12.20 గంటలకు శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
ఇంటర్ బోర్డు డబ్బులను ప్రభుత్వం దోచుకుంది
ఇంటర్ బోర్డుకు సంబంధించిన150 కోట్లు ను ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇది మొదటి సారి అని, ఇంటర్ బోర్డు డబ్బులను ప్రభుత్వం దోచుకుందన్నారు. ఉచిత పాఠ్య పుస్తకాల కోసం ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను 52 కోట్లు కూడా ఇంటర్ బోర్డ్ నుండి చెల్లించాలని ఆదేశించిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉచిత విద్యకు ఈ పది ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 62 లక్షలు మాత్రమేనని, ప్రభుత్వం ఇంటర్ విద్య ను గాలికి వదిలేసిందన్నారు మధుసూదన్ రెడ్డి. ఇంటర్ బోర్డు ఆర్థిక పరిస్థితి దిగజారిందని, పరీక్షలో డ్యూటీ లో, స్పాట్ వల్యూవేషన్‌లో పాల్గొన్న వారికి రెమ్యునరేషన్ ఇవ్వలేని పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు.
రేపు హైదరాబాద్‌కు సీఎం జగన్.. కేసీఆర్‌తో కీలక భేటీ!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు. గత నెల 8వ తేదీన కేసీఆర్ గజ్వేల్ ఫాంహౌజ్‌లో కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగన సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నారు. కొద్దికాలం కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కేసీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందతున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల నాయకులు, బీఆర్‌ఎస్ నేతలు ఆయనను పరామర్శించారు.
తెలంగాణలో అమర్ రాజా భారీ పెట్టుబడులు
తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ సంప్రదింపులు జరిపారు. అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు నెలకొల్పుతోంది. ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గల్లా జయదేవ్ తో చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం అందించే సహాయ సహకారాలపై సమావేశంలో చర్చించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సన్మానించిన ఓయూ నేతలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లను రాష్ట్ర సచివాలయంలో టీపీసీసీ అధికార ప్రతినిధి ఓయూ జేఏసీ చైర్మన్ లోకేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరము పురస్కరించుకొని భట్టి విక్రమార్కతో విద్యార్థి నాయకులు కేక్ కట్ చేయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేతగా పాదయాత్ర చేసినటువంటి ఫోటోలను టీపీసీసీ అధికార ప్రతినిధి ఓయూ జేఏసీ చైర్మన్ లోకేష్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా బహుకరించారు.