YSR Pension: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కాకినాడలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. నేరుగా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం సభలో.. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.
Read Also: Heavy Traffic : హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జాం
రేపు పెన్షన్ల పెంపు పై కార్యక్రమంలో సీఎం జగన్.. 2,750 రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంచనున్నారు. కాగా.. ప్రభుత్వం ఏటా 66.34 లక్షల మందికి పెన్షన్లు అందిస్తుంది. పెన్షన్ల పై ఏటా వ్యయం రూ.23,556 కోట్లు చేయనుంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం సుమారు 83,526 కోట్లు.
Read Also: Israel-Hamas War: భార్య ఉండటం వల్లే తనపై అత్యాచారం చేయలేదు.. బందీగా బయటపడిన యువతి