YCP Joining: సీఎం జగన్ సమక్షంలో బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ వైసీపీలో చేరారు. గతంలో ఆమే బీజేపీ ఎంపీగా పని చేశారు. అయితే.. హిందూపూర్ ఎంపీగా బరిలో శాంతమ్మను నిలబెట్టాలని అధిష్టానం భావిస్తుంది. ఈ క్రమంలోనే పార్టీలో అధికారికంగా చేరింది. ఈ సందర్భంగా శాంతమ్మ మాట్లాడుతూ.. వైసీపీ సిద్దాంతాలు, పనులు చూసి పార్టీలో చేరానని అన్నారు. దేశంలో ఏ పార్టీ చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ చేస్తున్నారని తెలిపారు.
Read Also: YS Sharmila: కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నా..
దేశమే జగన్ వైపు చూస్తోంది శాంతమ్మ చెప్పారు. వైసీపీలో సామాన్య కార్యకర్తగా పని చేస్తా.. పార్టీలో పెద్దలు తనను ఆశీర్వదించాలని కోరారు. జగన్ ఇంటి పెద్ద కొడుకులా కష్ట పడుతున్నారని తెలిపారు. వైసీపీలో చేరడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ వాల్మీకిలకు ప్రత్యేక స్థానం ఇచ్చారని అన్నారు. టికెట్ విషయంలో హై కమాండ్ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని శాంతమ్మ తెలిపారు.
Read Also: Fact-Check: ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ చనిపోయాడా..? నిజం ఇదే..