ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయం మొత్తం రోడ్ల చుట్టే తిరుగుతోంది. రోడ్ల సమస్యను ఎత్తిచూపే క్రమంలో టీడీపీ.. జనసేన పార్టీలు జగన్ సర్కారును టార్గెట్ చేస్తున్నాయి. దీంతో వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ దిగుతున్నారు. ఏపీలోని అధ్వాన్న రహదారులపై నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. ఈక్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా రోడ్ల నిర్మాణలపై సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. రోడ్లను కేరాఫ్ చేసుకొని ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తుండటంతో…
వైఎస్ఆర్ చేయూతపై హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బట్టుదేవానంద్ బెంచ్ ముందు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరాం… వైఎస్ఆర్ చేయూత అనేది రాష్ట్ర ఆర్థిక విధానం, ఆర్థిక సమర్థతకు సంబంధించిన అంశాల్లో ఒకటి. అందువల్ల ఈవ్యవహారంలో కోర్టులకుండే పాత్ర పరిమితం పథకానికి అర్హులు ఎవరు? అమలు ఎలా? అనే అంశాల్లో కోర్టుల పాత్ర పరిమితం. పెద్ద సంఖ్యలో మహిళలు ఈపథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏటా వరుసగా నాలుగు సంవత్సరాలు వారి…
సీఎం జగన్ రోడ్ల అభివృద్ధి పై సమీక్ష చేశారు అని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. గత టీడీపీ హయాంలో పీఎంజిఎస్ వై ద్వారా 330 కిలోమీటర్లు మాత్రమే వేశారు. మేము 3,185 కిలోమీటర్లకు టెండర్లు పిలిచి 970 కిలోమీటర్లు పూర్తి చేశాము. ఏఐబీ ద్వారా 5,238 కిలోమీటర్లు టెండర్లు పిలిస్తే.. 1816 కిలోమీటర్లు రోడ్లు పూర్తి చేసాము. టీడీపీ హయాంలో పంచాయతీ రాజ్ శాఖ తరపున 1,130 కిలోమీటర్లు రోడ్లు వేశారు. అక్టోబర్ నాటికి టెండర్లు పిలిచి…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, నవ్యాంధ్రలుగా ఏర్పడ్డాక రాజకీయంలో స్పష్టమైన మార్పు వచ్చేసింది. తెలంగాణ మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించగా.. ఏపీ మాత్రం లోటుబడ్జెట్ రాష్ట్రంగా మిగిలిపోయింది. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం చెప్పినా.. అది నీటిమీద రాతలుగా మిగిలిపోయింది. హైదరాబాద్ ను తానే నిర్మించానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో కనీసం ఏపీకి రాజధానిని కూడా నిర్మించకపోవడం శోచనీయంగా మారింది. తన పాలనలో సంక్షేమాన్ని పెద్దగా…
ఏపీలో వినాయక చవితి వేడుకలపై ఆంక్షల వివాదం తీవ్ర రూపు దాల్చింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, సత్యకుమార్ అరెస్ట్‌పై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి.నేడు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలవద్ద బీజేపీ నేతలు ధర్నాలకు దిగనున్నారు. మరోవైపు.. వేడుకలకు ససేమిరా అంటున్నారు అధికారులు. ఏపీలో వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలను..బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హిందూ సాంప్రదాయాల్లో తొలి పూజ అందుకునే గణనాధుని ఉత్సవాలకు అడ్డంకులా అంటూ బీజేపీ…
వినాయక చవితి మీద విధించిన ఆంక్షలపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగర్హం వ్యక్తం చేసారు. జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. రంజాన్, క్రిస్మస్, మొహారం పండుగలపై లేని ఆంక్షలు వినాయక చవితిపై ఎందుకు అని అడిగారు. చర్చిలో ప్రార్థనలు, టీటీడీ లో దర్శనాలు, బస్సుల్లో ప్రయాణాలకు అనుమతించారు కదా…. వినాయక విగ్రహాలు ఆలయాల్లో పెడితే తప్పా… ఇళ్లల్లో పూజలు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పాలా… ఇళ్లలో పూజలకు ప్రభుత్వ అనుమతి అవసరమా అన్నారు. అలాగే…
వైసీపీ అధికారంలోకి వచ్చి అప్పుడే దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారానికి ముందుగానే రెండున్నరేళ్ల తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని హింట్ ఇచ్చారు. అందుకనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ రిపోర్టు తెప్పించుకొని కొత్త క్యాబినెట్ కూర్పుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే దసరా లేదంటే దీపావళి నాటికి ఏపీలో కొత్త క్యాబినెట్ కొలువుదీరడం ఖాయమనే టాక్ విన్పిస్తుంది. ఈనేపథ్యంలో ఆశావహులంతా జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు తమవంతు ప్రయత్నాలు…
వైఎస్ జగన్.. వైఎస్ షర్మిల. అన్నా చెల్లెళ్లు. అన్న.. ఆంధ్రను ఇప్పటికే ఏలుతున్నారు. చెల్లెలు తెలంగాణ వేదికగా రాజకీయం వేడిగా ప్రారంభించారు. ప్రతి మంగళవారం చెప్పినట్టుగా నిరుద్యోగుల తరఫున పోరాట దీక్ష చేస్తున్నారు. కడుపు మాడ్చుకుని మరీ.. దీక్షలతో వార్తలతో చోటు పొందుతున్నారు. విమర్శల ధాటి పెంచుతున్నారు. ఈ క్రమంలో.. జగన్ తీరుపై చాలా మందికి ఎప్పుడో స్పష్టత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో తప్ప.. పొరుగున ఉన్న తెలంగాణలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని.. ఆయన క్యాంప్…
అమరావతి : బోగస్ చలాన్ల కుంభకోణంతో అలెర్టైంది ఏపీ ప్రభుత్వం. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ తరహాలోనే మరి కొన్ని శాఖల్లోనూ అంతర్గత తనిఖీలు చేయాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. చలానాల రూపంలో ప్రజలు చెల్లించే నగదు సీఎఫ్ఎంఎస్ కు చేరుతుందా..? లేదా అనే అంశంపై వివరాలు సేకరిస్తోన్న అధికారులు… ఎక్సైజ్, మైనింగ్, రవాణ, కార్మిక తదితర శాఖల్లో అంతర్గత తనిఖీలు చేపడుతున్నారు. ప్రజలు చెల్లించే చలానాల నగదు సీఎఫ్ఎంఎస్ కు చేరేందుకు జాప్యం జరుగుతోందని గుర్తించిన…
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ… ప్రపంచ చరిత్రలో మానవత్వం ఉండే నాయకుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకరు అని తెలిపారు. చరిత్ర పుటల్లో స్వర్ణక్షరాలతో రాయదగిన వ్యక్తి వైఎస్సార్. సమాజం మీద ప్రేమను చాటడమే కాకుండా కేవలం 5 ఏళ్ళల్లో ప్రజల జీవితాల్లో ఎంత ముద్ర వేయవచ్చో నిరూపించిన వ్యక్తి అని తెలిపారు. ఆయన నాటిన మొక్కే ఇవాళ జగన్ మహా వృక్షం అయి మన ముందు ఉన్నారు. తండ్రికి తగిన తనయుడు.…