వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ… ప్రపంచ చరిత్రలో మానవత్వం ఉండే నాయకుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకరు అని తెలిపారు. చరిత్ర పుటల్లో స్వర్ణక్షరాలతో రాయదగిన వ్యక్తి వైఎస్సార్. సమాజం మీద ప్రేమను చాటడమే కాకుండా కేవలం 5 ఏళ్ళల్లో ప్రజల జీవితాల్లో ఎంత ముద్ర వేయవచ్చో నిరూపించిన వ్యక్తి అని తెలిపారు. ఆయన నాటిన మొక్కే ఇవాళ జగన్ మహా వృక్షం అయి మన ముందు ఉన్నారు. తండ్రికి తగిన తనయుడు. అందరికీ సమాన అవకాశాలు కల్పించటానికి చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నారు. నాన్న ఒకడుగు వేస్తే పది అడుగులు వేస్తాననే విధంగా ఒక అభ్యుదయ వాదిగా జగన్ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్ధిక సంక్షోభ సమయంలో కూడా ప్రపంచమే గర్వపడే విధంగా పాలన చేస్తున్నారు అని పేర్కొన్నారు.