ఏపీలో ఎంపీలాడ్స్ నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. నిబంధనలకు అనుగుణంగా నిధులు ఖర్చుచేయలేదని ఫిర్యాదులు అందడంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని పేర్కొంది కేంద్రం. ఏపీలో ఎంపీలాడ్స్ నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ. నిబంధనల అనుగుణంగా ఎంపీ లాడ్స్ నిధులు ఖర్చు చేయకపోవటంపై వివరణ ఇవ్వాలని ప్రణాళికా విభాగం ముఖ్య…
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ మహదేవ్ అక్రమ అరెస్టు అత్యంత దుర్మార్గం. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే నెపంతో అరెస్టు చేసి.. ఆచూకీ కూడా చెప్పకుండా తిప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డీజీపీ కార్యాలయానికి, పోలీస్ బెటాలియన్ కు మధ్యలో, సీఎం నివాసానికి సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు మారణాయుధాలతో తెగబడినా.. పోలీసులు పట్టించుకోలేదు. కానీ.. సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పోలీసుల…
ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం వెలిగ పూడిలోని సచివాలయంలో సమావేశం కానుంది మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, టీడీపీ నేతల భాషపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక, వచ్చేవారం ఢిల్లీ వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధం కావడంతో.. పోటీగా వైసీపీ నేతలు కూడా హస్తిన బాట పట్టనున్నట్టు…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… ఇవాళ్టి విశాఖ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం.. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటన లో వెల్లడించింది. అయితే… విశాఖ టూర్ షెడ్యూల్ ప్రకారం.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు గన్న వరం విమానాశ్రమం నుంచి విశాఖ బయలు దేరాల్సి ఉంది. సాయంత్రం 5.20 గంటలకు విశాఖ చేరుకుని ఎన్‌ఏడీ జంక్షన్ లో ఫ్లై ఓవర్ తో పాటు.. వీఎంఆర్‌డీఏ పూర్తి చేసిన 6…
పార్టీ కార్యాలయంపై దాడి చేయండని పోలీసులే వైసీపీ కార్యకర్తలను పంపిస్తున్నారు అని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. దాడి చేశాక.. వారిని పంపడానికి గుంటూరు నుంచి డీఎస్పీ వస్తారు. కొన్ని పిల్లులు పులులమనుకుంటున్నాయి. ఒక చెంప కొడితే రెండు చెంపలు కొడతాం. వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ గుర్తు పెట్టుకుంటున్నాం. ఏపీలోనే కాదు.. దేశంలో ఎక్కడున్నా వదిలి పెట్టం. మా పార్టీ కార్యాలయంలో పగిలినవి.. అద్దాలే మా కార్యకర్తల గుండెలు బద్దలు కొట్టలేరు. మాది పేటీఎం బ్యాచ్…
ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రి జగన్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల మంటలు వేడిరాజేస్తూనే వున్నాయి. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు తమ దైన రీతిలో మండిపడుతూనే వున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టాభి ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాయలసీమ ప్రాంతంలో చేసి ఉంటే అడ్రస్ లేకుండా ఉండేవాడని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. 2024లో చంద్రబాబుని రాష్ట్రం నుండి పంపిచేస్తే…
ఏపీలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. వైసీపీ-టీడీపీ నేతల మాటల మంటలు కొనసాగుతూనే వున్నాయి. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళేది టీడీపీని బీజేపీలోకి కలపడానికే అన్నారు. పట్టాభిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వుంటే బాగుండేదని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ అన్నారు. పట్టాభిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నానని చెప్పి చంద్రబాబు దీక్ష చేసి ఉంటే బాగుండేదన్నారు. చంద్రబాబు దీక్ష వేదిక నుండి ఏం మాట్లాడారో అందరం చూశామని, దీక్ష ముగిసే లోపు చంద్రబాబు..…
సీఎం జగన్ పాపాలు పండాయి.. ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలే దాడి చేశారంటూ తమ వద్దనున్న సాక్ష్యాలను విడుదల చేసింది టీడీపీ. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ… గంజాయి గురించి విమర్శిస్తే వారినే బొక్కలో వేసే పరిస్థితి వస్తోందని… ప్రభుత్వాధినేత అయిన జగన్.. రాజ్యాంగాధినేతగా ప్రకటించుకున్నారని మండిపడ్డారు. జగన్ రాసుకున్న రాజ్యాంగంలో అలా ఉందేమో..? తనను తిట్టారు కాబట్టి.. కొట్టండి అని…
జగన్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తొలివిడత 4,314 డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ లైబ్రరీలకు అవసరమయ్యె ఇంటర్‌నెట్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని, అప్పుడే వర్క్ హోం కాన్సెప్ట్ విజయవంతం అవుతుందన్నారు. దీంతో పాటు రైతు భరోసా రెండో విడత కార్యక్రమాన్ని…
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు అమాంతం పెంచి సంక్షేమ పథకాల్లో కోత విధిస్తూ పేద ప్రజలను మోసం చేస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. గురువారం కోవెలకుంట్ల మండలం లోని కలుగొట్ల గ్రామంలో ఆయన పర్యటించి విద్యుత్ సమస్య కరెంట్ ఛార్జీల పెరుగుదలతో ప్రజలను ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెబుతూ విద్యుత్ బిల్లులు పెంచి సంక్షేమ పథకాల్లో…