అమరావతి : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఊహించని షాక్ తగిలింది. వాణిజ్య పన్నుల శాఖను నుంచి నారాయణ స్వామిని తప్పించింది ఏపీ ప్రభుత్వం. ఆ వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎక్సైజ్ శాఖకే నారాయణ స్వామి పరిమితం కానున్నారు. వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకెళ్లాలని గతంలో భావించింది ఏపీ ప్రభుత్వం. అయితే అప్పట్లో అభ్యంతరాలు…
ఏపీలో దీపావళి పండుగ రోజున క్రాకర్స్ కాల్చడంపై ఆంక్షలు విధించారు. ధ్వని, వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అది కూడా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చి… పండుగ జరుపుకోవాలని కోరింది. శబ్ధ కాలుష్యం లేకుండా చూడటం కోసం ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. థర్డ్‌వేవ్…
అమరావతి రైతుల మహా పాదయాత్రకు డీజీపీ సవాంగ్ అనుమతి ఇచ్చారు. రైతుల పాదయాత్రకు 20 షరతులతో డీజీపీ అనుమతి ఇచ్చామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పాదయాత్రకు అనుమతిస్తున్నట్టు డీజీపీ గౌతం సవాంగ్ ప్రకటించారు. గుంటూరు అర్బన్, రూరల్, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అర్బన్ ఏస్పీలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. రైతుల పాదయాత్రకు పూర్తి బందోబస్తు కల్పించాలని డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు, డీజే సౌండ్లు, బహిరంగసభలు నిర్వహించవద్దని డీజీపీ…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. కుప్పంలోని సామగుట్టపల్లెలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ సర్కార్‌పై పలు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రెండున్నర ఏళ్లుగా అభివృద్ధి ఆగిపోయిందని, రెస్కోను డిస్కంలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నారని వాటిని మేము అంగీకరించబోమన్నారు. అంతేకాకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ హయాంలో కట్టించిన ఇళ్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. స్థలం ఇవ్వలేదు, ఇల్లు కట్టలేదు కానీ…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటించారు. తొలుత అదానీ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ‘ఎంజీఆర్ స్వజల్’ ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ని విద్యుత్ శాఖ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించి పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళా కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే…
దేశంలో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీడబ్యూసీ మెంబర్ చింతామోహన్ . దేశ పరిస్థితులు బాగాలేవని, ధరలు బాగా పెరిగిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. వంటగ్యాస్ ధర మళ్ళీ పెరగబోతోందన్నారు. గ్యాస్ సిలిండర్ వెయ్యిరూపాయలు దాటబోతోందని, పెట్రోల్ డిజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆయన అన్నారు. భారత్ దేశంలో ఆకలి కేకలు ఎక్కువగా ఉన్నాయని, నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని విమర్శించారు చింతా మోహన్. ఒకవైపు సామాన్యుడు వందరూపాయలు సంపాదించలేక ఆకలితో అలమటించి పోతుంటే..…
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్లీనరీలో ఏపీలో పార్టీ పెట్టాలనుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను లోకేష్ ప్రస్తావించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎద్దేవా చేయడం సీఎంగా మీకు అవమానం అనిపిస్తుందో లేదో కానీ, ఐదుకోట్ల ఆంధ్రులకు మాత్రం ఆ వ్యాఖ్యలు తీరని అవమాకరంగా భావిస్తున్నారని లోకేష్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏపీ సర్కారు ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులపై కన్నేసిందని, ప్రభుత్వం…
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నాడు మరోసారి కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా అమ్మకాల ఒత్తిడిని తట్టుకోలేక సెన్సెక్స్ భారీ నష్టాలను చవి చూసింది. ఉదయం పూట నష్టాలతోనే మొదలైన మార్కెట్లు చివరి వరకు అదే ధోరణిని కొనసాగించాయి. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1158 పాయింట్లు దిగజారి 59,984 వద్ద స్థిరపడింది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ కూడా 353 పాయింట్లు నష్టపోయి 17,857 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు…
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ)తో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. రాష్ట్రంలో భారీ పర్యాటక ప్రాజెక్టులపై బోర్టు సమావేశం నిర్వహించగా..పలు ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఒక్కో ప్రాజెక్టుపై కనీసం రూ.250 కోట్లు పెట్టుబడులు వస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా వివిధ ప్రాజెక్టులపై రూ.2,868.6 కోట్ల పెట్టుబడులు వస్తాయని తెలిపింది. ప్రాజెక్టుల ద్వారా ఐదేళ్లలో 1,564 గదుల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసువస్తామని తెలిపారు. ఓబెరాయ్…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డులో చర్చ జరిపారు. ఏపీలో పర్యాటకరంగానికి ఊతం ఇచ్చే దిశగా పలు కిలక ప్రాజెక్టులు రానున్నాయి. ఒక్కో ప్రాజెక్టు పై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు. దాదాపు 48 వేల మందికి ఉద్యోగ అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా…