ఈనెల 14న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరవుతారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయంతో పాటు కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం…
అమరావతి : పెట్రోల్ ధరలపై తగ్గించకపోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. వసూల్ రెడ్డి గారు నిద్రలేచేది ఎప్పుడు? పెట్రోల్, డీజిల్ పై బాదుడు ఆపేది ఎప్పుడు? అంటూ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి సామాన్యులపై భారాన్ని తగ్గించడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై రూ.12 తగ్గించాయని… అస్సోం,…
వెలుగు జిలుగుల పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు. ముఖ్యమంత్రి జగన్ దీపావళి శుభాకాంక్షలు అన్నారు జగన్. చీకటిపై వెలుగు, చెడుపై మంచి విజయానికి ప్రతీక దీపావళి. ఈ పండుగ మీ అందరి ఇంట ఆనందపు కాంతులు నింపాలని, సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ శుభాభినందనలు తెలిపారు జగన్. ఇటు…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 9న భువనేశ్వర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇక ఈ భేటీ లో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం గురించి చర్చించనున్నారు సీఎం జగన్. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశా ప్రభుత్వం సహకారం కోరుతూ గతంలో ముఖ్యమంత్రి లేఖ రాశారు. చాలా రోజులుగా పోలవరంపై…
విదేశీ వ్యవహారాల కోసం ప్రత్యేక పోస్టుని క్రియేట్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీకి అంతర్జాతీయ సహకారం కోసం రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఏ. గీతేష్ శర్మను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జీఏడీ పరిధిలోకి ప్రత్యేక పోస్ట్ వస్తుందని చెప్పింది. వివిధ దేశాల దౌత్య కార్యాలయాలతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారి నియామకం చేపట్టింది. అన్ని దేశాల దౌత్య కార్యాలయాలతో సమన్వయం, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ కి సహకారం, అంతర్జాతీయ తెలుగు సంఘాలకి సహకారం అందించనున్నారు గీతేష్…
తిరుపతిలో నవంబర్ 14న జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరుగనుంది. అయితే కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో జగన్ సమావేశమయ్యారు. ఏపీ విభజన చట్టంలో పెండింగులో ఉన్న అంశాలు, తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టులో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రూ. 6300 కోట్ల విద్యుత్‌బకాయిలు,…
ఆర్థిక ఉగ్రవాది పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాళా దిశగా పయనిస్తోంది. అప్పులమయమైన రాష్ట్రం, త్వరలోనే చీకట్ల పాలు కానుంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఆఖరికి గవర్నరును కూడా ఈ ప్రభుత్వం తమస్వార్థానికి బలి చేసింది. గవర్నర్ అధికారులను పిలిచి, తన పేరు ఎందుకు వాడుకున్నారని మందలించే వరకు పరిస్థితి వచ్చింది. గవర్నర్ రిటైరయ్యి, రేపు తన సొంత రాష్ట్రానికి వెళ్లినా కూడా, ప్రభుత్వం చేసిన తప్పులు ఆయన్ని వదలవు అన్నారు.…
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ శాఖ పరిధిలోకి కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కార్పొరేషన్‌లు రానున్నాయి. Read Also: వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం సాధించిన ప్రగతి ఇదేనా? అలాగే జైన్‌ల సంక్షేమానికి, సిక్కుల…
ఏపీలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నిక ద్వారా వైసీపీ అభ్యర్థి డా.సుధ ఏకంగా సీఎం జగన్ రికార్డునే అధిగమించారు. బద్వేల్ ఉప ఎన్నికలో ఆమె రికార్డు మెజారిటీతో ఘనవిజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల నుంచి పోటీ చేసిన జగన్ టీడీపీ అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డిపై 90,110 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పోలైన 1,80,127 ఓట్లలో జగన్మోహన్ రెడ్డికి 1,32,356 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో జగన్‌కు 75,243 ఓట్ల మెజార్టీ…
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. జగన్ తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇదంతా బద్వేలులో వైసీపీ విజయం సాధించినందుకు అనుకుంటున్నారా? కాదండి. నవంబర్ 1న వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగన్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Read Also: బీరువాలో లక్షదాచిన వృద్ధుడు… ఆ తర్వాత ఏమైంది? ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు…