అమరావతి : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఊహించని షాక్ తగిలింది. వాణిజ్య పన్నుల శాఖను నుంచి నారాయణ స్వామిని తప్పించింది ఏపీ ప్రభుత్వం. ఆ వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎక్సైజ్ శాఖకే నారాయణ స్వామి పరిమితం కానున్నారు. వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకెళ్లాలని గతంలో భావించింది ఏపీ ప్రభుత్వం.
అయితే అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. దీంతో అప్పటి ప్రతిపాదలను ఇప్పుడు అమలు చేయాలని సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది సర్కార్. ఇక త్వరలోనే మరో డెప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖను తప్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.