కడప : బద్వేల్ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఏకంగా… 90, 228 ఓట్ల తో భారీ మెజారిటీతో గెలుపొందారు వైసిపి అబ్యర్ధి సుధా. 12 వ రౌండు పూర్తయ్యే సరికి 1,46,546 ఓట్లు కౌంట్ చేశారు ఎన్నికల అధికారులు. ఇక ఈ 12 వ రౌండ్ ముగిసే సరికి వైసీపీ అభ్యర్థిని సుధాకు వచ్చిన మొత్తం 1,11, 710 ఓట్లు వచ్చాయి. అలాగే… బీజేపీ అభ్యర్థి సురేష్‌కు..…
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ దూసుకుపోతుండగా.. జాతీయ పార్టీ కాంగ్రెస్ కుదేలయింది. ఆరోరౌండ్ తర్వాత వైసీపీకి 52,044 ఓట్ల ఆధిక్యం లభించింది. పోటీలో నిలబడి పరువు కోల్పోయిందనే భావన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల్లో వుంది. బద్వేల్ బరికి టీడీపీ, జనసేన దూరంగా వున్నాయి. బద్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు గొప్ప ఓటు బ్యాంకు ఉందా అంటే అంత సీన్ లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌కు అక్షరాల 2వేల 148 ఓట్లు పోలయ్యాయి. ఇక…
ఎయిడెడ్ విద్యాసంస్థలకు చెందిన లక్షల కోట్ల ఆస్తులను తాకట్టు పెట్టి, అప్పులు తేవాలన్న తాపత్రయంలో ప్రభుత్వముంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కేవలం ఆస్తుల కోసమే ఎయిడెడ్ విద్యావ్యవస్థల స్వాధీనానికి ప్రభుత్వం సిద్ధమైంది. విద్యావ్యవస్థ పతనానికి దారితీసేలా సీఎం వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎయిడెడ్ విద్యావ్యవస్థను పునరుద్ధరిస్తుంది. లక్షలాది విద్యార్థులు, వేలాదిమంది ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకునే హక్కు ఈప్రభుత్వానికి ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల స్వాధీనంతో,…
ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్మారకార్థం అవార్డులు ప్రధానత్సవ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుజాతి తరఫున అందరికి శుభాకాంక్షలు.. కేంద్రం పద్మ అవార్డులను, భారతరత్న వంటి అవార్డులతో సత్కరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి అవార్డులు ఇవ్వాలని వైఎస్ఆర్ అవార్డులు ఇస్తున్నాం’ అని అన్నారు. ‘నిండైన తెలుగుదనం నాన్నగారి పంచెకట్టులో కనిపిస్తుంది. ఆకాశమంత ఎత్తు ఎదిగిన ఆ మహామనిషి…
అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామన్నారు. అనంతరం…
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఈ ఏడాది మే 31న ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. ఈ స్థానాలకు గతంలోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికలను వాయిదా వస్తూ వచ్చింది. ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబరు 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబరు 19న పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. ఏపీలో మే 31న ఎమ్మెల్సీల పదవీ కాలం…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప పోరు రసవత్తరంగా సాగింది. అయితే, తెలంగాణలోని హుజురాబాద్ తో పోలిస్తే ఏపీలోని బద్వేలులో అంతగా జనం ఆసక్తి చూపించలేదు. బద్వేల్ లో టీడీపీ, జనసేన పోటీ నుంచి తప్పుకోవడంతో పోటీ అంతగా కనిపించలేదు. అధికార వైసీపీ అభ్యర్ధిని పరిగణనలోకి తీసుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 9 శాతం తక్కువగా పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 76.37 శాతం నమోదు కాగా.. ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం 68.12గా నమోదైంది. బద్వేలు…
ఏపీలో 3 రాజధానులు చేస్తామని సీఎం జగన్ ప్రకటించిననాటి నుంచి అమరావతి రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఏపీని అభివృద్ధి చేసేందుకే 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతుంటే.. వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరితో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయటం లేదంటూ టీడీపీతో పాటు వివిధ పార్టీల నేతలు అంటున్నారు. అంతేకాకుండా రాజధాని అమరావతి అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులు తమ త్యాగం వృధా అయిందని ఆవేదన చేస్తున్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలని…
దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో ఏపీకి 3వ స్థానం లేచింది అని చెప్పిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలోని అరాచకపాలన వల్లే అన్నదాతల ఆత్మహత్మలు చేసుకుంటున్నారు అని అన్నారు రోజుకి సగటున ముగ్గురు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వైసీపీ సర్కారు తీరుతో రెండున్నరేళ్లలో 34 శాతం పెరిగిన ఆత్మహత్యలు. ఇప్పటికైనా రైతాంగాన్ని ఆదుకోకపోతే రైతుల్లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. జగన్ సీఎం అయ్యాక ఒక్క 2020 సంవత్సరంలోనే 889 మంది రైతులు బలవన్మర ణాలకు…
ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఉపాధి హామీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించి పేదవాడి కడుపు దని విమర్శించారు. ఉపాధి హామీ నిధులు వ్యయంపై విమర్శించారు మాజీ మంత్రి అయ్యన్న. నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాల్లో గోతులు పూడ్చడానికి ఉపాధి హామీ నిధులను వినియోగించారని మండిపడ్డారు. ఈ విధంగా రెండు వేల కోట్ల నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం…