నిండైన తెలుగుదనం నాన్నగారి పంచెకట్టులో కనిపిస్తుంది : సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్మారకార్థం అవార్డులు ప్రధానత్సవ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుజాతి తరఫున అందరికి శుభాకాంక్షలు.. కేంద్రం పద్మ అవార్డులను, భారతరత్న వంటి అవార్డులతో సత్కరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి అవార్డులు ఇవ్వాలని వైఎస్ఆర్ అవార్డులు ఇస్తున్నాం’ అని అన్నారు.
‘నిండైన తెలుగుదనం నాన్నగారి పంచెకట్టులో కనిపిస్తుంది. ఆకాశమంత ఎత్తు ఎదిగిన ఆ మహామనిషి పేరు మీద అత్యున్నత పౌర పురస్కారాలు ఇస్తున్నాం. వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులకు 10 లక్షలు, అచీవ్మెంట్ అవార్డులకు 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది’ అని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రతీ సంక్షేమ పథకం ప్రతీ పేదవాడికి అత్యంత పారదర్శకంగా ఇచ్చామని, అవార్డుల ఎంపికలో కుల, మత, ప్రాంత, రాజకీయాలను చూడలేదని, మనిషిని మనిషిగానే చూసామన్నారు.
Also Read
- MP Mithun Reddy: తమను ఇబ్బంది పెట్టినా భరిస్తాం.. కానీ, కేడర్ జోలికి వస్తే ఊరుకోం.. మిథున్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
- YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
రాష్ట్ర చరిత్రలోనే భేదాభిప్రాయాలు లేని అత్యంత ఉన్నత అవార్డులు ఇస్తున్నామని, మన సంస్కృతిని ఇనుమడింప చేసిన ప్రతీ ఒక్క మహోన్నత వ్యక్తికి, వ్యవస్థకి, సంస్థలకు అవార్డులిస్తున్నామని ఆయన తెలిపారు. రైతుకు, వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో విప్లవానికి ఇస్తున్న అవార్డులని అన్నారు. ప్రతీ ఏటా నవంబరు 1న ఈ అవార్డులు ఇస్తామని ప్రకటించారు.
తాజావార్తలు
-
IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
-
DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!