విదేశీ వ్యవహారాల కోసం ప్రత్యేక పోస్టుని క్రియేట్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఏపీకి అంతర్జాతీయ సహకారం కోసం రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఏ. గీతేష్ శర్మను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జీఏడీ పరిధిలోకి ప్రత్యేక పోస్ట్ వస్తుందని చెప్పింది. వివిధ దేశాల దౌత్య కార్యాలయాలతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారి నియామకం చేపట్టింది. అన్ని దేశాల దౌత్య కార్యాలయాలతో సమన్వయం, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ కి సహకారం, అంతర్జాతీయ తెలుగు సంఘాలకి సహకారం అందించనున్నారు గీతేష్ శర్మ. అంతర్జాతీయ సహకారం పై వివిధ ప్రభుత్వ శాఖలకు సలహాలు ఇవ్వనున్నారు.