తిరుపతిలో నవంబర్ 14న జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరుగనుంది. అయితే కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో జగన్ సమావేశమయ్యారు.
ఏపీ విభజన చట్టంలో పెండింగులో ఉన్న అంశాలు, తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టులో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రూ. 6300 కోట్ల విద్యుత్‌బకాయిలు, రెవెన్యూలోటు, రేషన్ బియ్యంలో హేతుబద్ధత లేని కేంద్రం కేటాయింపులు లతో పాటు తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్ సప్లైస్ బకాయిల అంశాలపై చర్చించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
వీటితో పాటు ఎఫ్‌డీ ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలనూ, ప్రత్యేక హోదా అంశాన్ని కూడా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాలని, రాష్ట్ర అంశాల పై పూర్తి వివరాలతో సిద్ధం కావాలి అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై కూడా సిద్ధంగా ఉండాలి జగన్ సూచించారు.