పోలీసుల అండతో రైతులపై ప్రభుత్వం కక్షసాధిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద మహాపాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసులు చేసిన లాఠీఛార్జ్ ఘటనపై చినరాజప్ప స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీఛార్జ్ చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఎంత భయపెట్టినా రాజధాని రైతుల మహాపాదయాత్ర ఆగదని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతులు ఉన్నా ఖాకీలు ఆంక్షలెందుకు పెట్టారు..?…
ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహా పాదయాత్ర మొదలుపెట్టారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని రైతుల మహా పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు. రైతుల మహా పాదయాత్ర చూసి సీఎం జగన్ భయపడుతున్నారని సెటైర్లు వేశారు. అందుకే రైతుల పాదయాత్రకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తోందన్నారు. రైతులు, మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు. రైతుల పాదయాత్ర…
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఆయా జిల్లాల కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలన్నారు. తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎస్ బృందాలు చేరుకున్నాయని, కర్నూలులో మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయని…
తుపాను కారణంగా ఏపీలో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతి అల్లాడుతోంది. తుపాన్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, దాన్ని ఎదుర్కొనేందుకు తిరుపతిలో యంత్రంగం సిద్ధంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతిలో తుపాన్ ప్రభావంతో దెబ్బ తిన్న ప్రాంతాలలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. జోరు వాన, గాలిని సైతం లెక్కచేయకుండా కలియదిరిగారు. లక్ష్మీపురం కూడలి వద్ద మోకాలి లోతైన నీటిలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేశారు. అశోక్ నగర్ వద్ద చెట్టు…
భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లతో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప కలెక్టర్లు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయని… తడ, సూళ్లూరుపేట, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు సీఎం జగన్. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని… ముఖ్యంగా…
ఇటీవల జరిగిన బద్వేల్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ గెలిచారు. బద్వేల్‌లో గెలుపు అనంతరం మొదటి సారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరుకు బద్వేల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దాసరి సుధకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఆమె వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ…
జగన్ ప్రభుత్వానికి, వైసీపీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో ఎయిడెడ్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేయగా.. వారిని పరామర్శించేందుకు లోకేష్ బుధవారం ఉదయం అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలకగా.. అనంతరం ప్రభుత్వం తమపై కేసులు పెడుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో లోకేష్ వారికి ధైర్యం చెప్పి టీడీపీ అధికారంలోకి…
ఏపీ సీఎం జగన్ ఒడిస్సా టూర్ సక్సెస్ అయిందా..? ఆ రాష్ట్ర సీఎంతో ఏపీ ముఖ్యమంత్రి జరిపిన చర్చలు సఫలమయ్యాయా..? ఎన్నో దశాబ్ధాల నుంచి పరిష్కారం కాని సమస్యలు ఓ కొలిక్కివచ్చినట్టేనా..? అసలు ఏపీ సీఎం జగన్.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ల మధ్య ఏ విషయాలు చర్చకువచ్చాయి..?ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఒడిషా సచివాలయంలో జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో ప్రధానంగా మూడు…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పీఆర్సీ నివేదిక వచ్చే వారం విడుదల కానుంది. ఉద్యోగులు 55 శాతం పీఆర్సీ ఆశిస్తుండగా..ప్రభుత్వం మాత్రం 27 శాతం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. పీఆర్‌సీ నివేదిక వస్తే దాన్ని బట్టి ఉద్యోగులు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. తమ ఆందోళనను అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సాయంత్రం సమావేశం కానున్నారు ఏపీ సీఎం జగన్. ఇప్పటికే భువనేశ్వర్ చేరుకున్నారు సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారుల బృందం. ఏపీ సీఎస్ కి ఒరిస్సా అధికారులు స్వాగతం పలికారు. రెండురాష్ట్రాలకు చెందిన వివిధ అంశాలను ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. ఉదయం 10.45 కు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్నారు సీఎం జగన్. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చేరుకోనున్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యే రెడ్డి శాంతి…