ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18న ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో మొదటి ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. కానీ టీడీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని కోరడంతో దానిపై వైసీపీ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే రెండవ రోజు ఉద్రిక్తతల నడుమ సాగిన అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. తాజాగా ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశం నిర్వహించనుంది.…
అంతా ఊహించిన విధంగా శనివారం అర్ధరాత్రి కడప జిల్లా కమలాపురంలో పాపాఘ్ని నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలు బంద్ చేసారు. గత రెండు రోజులుగా వంతెన వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీరు అంచుల వరకు చేరడంతో నానిపోయిన వంతెన నిన్న సాయంత్రం నుంచి కొంచెంకొంచెంగా నానుతూ వస్తోంది. ఏ క్షణమైనా వంతెన కూలుతుందని ఎన్టీవీ హెచ్చరించింది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ బ్రిడ్జి అనంతపురం నుంచి కడపకు వెళ్లే…
వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్ మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాలని ఆదేశించారు సీఎం జగన్. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సహాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలి. అక్కడున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. పట్టణాల్లో పారిశుద్ధ్య పనుల, డ్రైనేజీల పూడికతీత పనులతో…
ఏపీ సీఎం జగన్ తన పర్యటనలో ఎప్పుడూ అంబులెన్స్ లను దాటి పోలేదు. తాను ఎంత బిజీగా వున్నా. తన కాన్వాయ్ వెళుతున్న మార్గంలో అంబులెన్స్ సైరన్ వినిపిస్తే పక్కకి ఆపి దారిచ్చేవారు. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైఎస్ జగన్. 108 అంబులెన్స్ కోసం తన కాన్వాయ్ ని పక్కకి జరిపిన సీఎం జగన్. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తాడేపల్లి వెళుతుండగా ఎనికేపాడు వద్ద ఘటన జరిగింది. రోడ్డుమీద 108 అంబులెన్స్ ను చూడగానే…
వైసీపీ ప్రభుత్వం పై పవన్ ఫైర్ అయ్యారు. ఓ వైపు రాష్ర్టంలో పరిస్థితులు అస్తవ్యవస్తంగా ఉంటే ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతుందని ఆయన ట్విట్టర్ వేదికగా మండి పడ్డారు. రాష్ర్టం లో అరాచక పాలన నడుస్తుందని అన్నారు. ఓ వైపు భారీ వర్షాలతో వరదల భీభత్సంతో ఒక వైపు రాష్ర్టాన్ని కుదిపేస్తుంటే, ప్రజలు ఇళ్లు, వాకిళ్లు వదిలి రోడ్డున పడ్డారన్నారు. పశునష్టం, పంట నష్టం జరిగిందని వరద నివారణ చర్యలను ప్రభుత్వం ప్రారంభించలేదని ఆయన…
చాలా రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు… ఒకే చోట ప్రత్యక్షమయ్యారు. ఏపీ – తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం అనంతరం.. సీఎం కేసీఆర్, సీఎం జగన్… తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి వివాహానికి హాజరయ్యారు. హైదరాబాద్ లోని శంషాబాద్ లో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాళి వివాహాం జరిగింది. అయితే…. ఈ శుభ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, సీఎం జగన్…ఇద్దరూ ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. అంతేకాదు… ఈ…
ఒకవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న రాష్ట్రంపై భారీవర్షాలు తీరని భారం మోపాయి. భారీ వర్షాలు.. వరదలతో నాలుగు జిల్లాల్లో తీరని నష్టం సంభవించింది. నెల్లూరు, చిత్తూరు, అనంత, కడప జిల్లాలకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 24 మంది వర్షాలు, వరదల వల్ల చనిపోయినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. కడపలో 13, అనంతలో 7, చిత్తూరులో 4 మంది జల విలయానికి బలయ్యారు. 17 మంది గల్లంతైనట్టు ప్రకటించింది ప్రభుత్వం. కడపలో 11, చిత్తూరులో…
ఏపీలో భారీ వర్షాల వల్ల నష్టపోయినవారిని ఆదుకోవాలన్నారు సీఎం రమేష్. ఆంధ్రప్రదేశ్ లో గత రెండురోజులుగా కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో వరదలు సంభవిస్తే ప్రభుత్వ చర్యలు శూన్యం. ఆస్తి, ప్రాణ నష్టం తీవ్రంగా జరిగింది. చిన్న చిన్న పనులు, పింఛా, చెయ్యేరు ప్రాజెక్ట్ ల గేటు మరమ్మత్తు పనులు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా ? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం ఉందా లేదా? అసలు ప్రభుత్వం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కడప…
ప్రజాస్వామ్యంలో చట్ట సభలే దేవాలయాలు. ఒకప్పుడు వాటి పట్ల ప్రజలకు ఎంతో గౌరవం. కాని నేడు చట్ట సభల సమావేశాల తీరు మారింది. ప్రతిష్ట మసకబారింది. గౌరవ సభలు కాస్తా కౌరవ సభలు అవుతున్నాయి. చట్టసభల్లో మటలు హద్దులు హద్దులు దాటుతున్నాయి. హూందాగా సాగాల్సిన సమావేశాలు జుగుప్సాకర స్థాయికి దిగజారాయి. రాజకీయాలతో సంబంధం లేని వారిని, కుటుంబ సభ్యులను ఈ రొచ్చులోకి లాగి సమావేశాలంటేనే వెగటుపుట్టేలా చేస్తున్నారు. వారు వీరు అని లేదు. ఎవరు అధికారంలో ఉన్నా…
ఏపీలో వరద పరిస్థితులపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. రాయలసీమను వరదలు ముంచెత్తాయని… భారీ వర్షాలకు కడప జిల్లాలో 30 మంది గల్లంతయ్యారని, 12 మంది చనిపోయారని లోకేష్ తెలిపారు. వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే ఏం జరిగిందో కనుక్కునే తీరిక లేని సీఎం జగన్‌ను ఏమనాలని లోకేష్ ప్రశ్నించారు. వరదలతో ప్రజలు కొట్టుకుపోతుంటే.. ఏరియల్ సర్వే పేరుతో సీఎం జగన్ గాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ గాల్లో నుంచి…