వైసీపీ ప్రభుత్వం పై పవన్ ఫైర్ అయ్యారు. ఓ వైపు రాష్ర్టంలో పరిస్థితులు అస్తవ్యవస్తంగా ఉంటే ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతుందని ఆయన ట్విట్టర్ వేదికగా మండి పడ్డారు. రాష్ర్టం లో అరాచక పాలన నడుస్తుందని అన్నారు. ఓ వైపు భారీ వర్షాలతో వరదల భీభత్సంతో ఒక వైపు రాష్ర్టాన్ని కుదిపేస్తుంటే, ప్రజలు ఇళ్లు, వాకిళ్లు వదిలి రోడ్డున పడ్డారన్నారు. పశునష్టం, పంట నష్టం జరిగిందని వరద నివారణ చర్యలను ప్రభుత్వం ప్రారంభించలేదని ఆయన పేర్కొన్నారు.
మరో వైపు పచ్చని పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే ఈ సమయంలో ఇసుక అమ్ముతాం అంటూ ప్రకటనలు ఇస్తున్నారని, ఈ ప్రభుత్వానికి ప్రజా క్షేమం అక్కరలేదా అంటూ ప్రశ్నించారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ?? అంటూ ఆయన ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్ని స్తే వారిపై వ్యక్తిగత దాడులకు దిగుతూ దూషిస్తున్నారని ఇది సమంజసం కాదని ఆయన పేర్కొ న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించు కోవాలన్నారు.రాష్ర్టం ఓ వైపు వరదలతో సతమతమ వుతుంటే మరోవైపు ఇసుక అమ్మకాలకు ప్రకటనలు ఇవ్వడం ప్రభుత్వ లాభా పేక్షకు నిదర్శనమని ఆయన అన్నారు. ఇంతకన్నా హేయమైన చర్య ఇంకొకటి ఉండదన్నారు.
వరదల భీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే,ప్రజల ఇళ్ళు-వాకిళ్లు, పశు నష్టం – పంట నష్టం,
— Pawan Kalyan (@PawanKalyan) November 21, 2021
పచ్చటి-పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే , ఇలాంటి
సమయంలో వైసీపీ ప్రభుత్వం 'యిసుక అమ్ముతాం ' అన్న ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ?? pic.twitter.com/43GorfXoZg