అంతా ఊహించిన విధంగా శనివారం అర్ధరాత్రి కడప జిల్లా కమలాపురంలో పాపాఘ్ని నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలు బంద్ చేసారు. గత రెండు రోజులుగా వంతెన వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
నీరు అంచుల వరకు చేరడంతో నానిపోయిన వంతెన నిన్న సాయంత్రం నుంచి కొంచెంకొంచెంగా నానుతూ వస్తోంది. ఏ క్షణమైనా వంతెన కూలుతుందని ఎన్టీవీ హెచ్చరించింది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ బ్రిడ్జి అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారిపై ఉంటుంది. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఈ వంతెన పునరుద్ధరించేందుకు దాదాపు నెల రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు.