సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం పలికింది. ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శాసనసభలో ప్రవేశపెట్టనున్న ముసాయిదా బిల్లుల గురించి కేబినెట్ చర్చించింది. ఈ నెల 29న విద్యాదీవెన కార్యక్రమానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్, బోర్డ్‌లో 8 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో మెరుగైన సదుపాయాల…
ఏపీ శాసనమండలి నూతన ఛైర్మన్‌గా మోషేన్‌రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలిలో ఛైర్ వద్దకు మోషేన్ రాజును జగన్ తీసుకువెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. మోషేన్‌రాజు నిబద్ధత గల రాజకీయ నాయకుడు అని సీఎం జగన్ అభినందించారు. అనంతరం మోషేన్‌రాజుకు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. Read Also: కుటుంబ సభ్యులను కించపరచటం తగదు: పవన్ కళ్యాణ్ 1965, ఏప్రిల్ 10న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడిలో కొయ్యే సుందరరావు, మరియమ్మ దంపతులకు మోషేన్ రాజు…
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోడీ. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ప్రధానికి వివరించారు జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం వైయస్ జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు జగన్. బంగాళా ఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా గత వారం రోజులుగా…
నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్ కె రోజా మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై తనదైన రీతిలో విమర్శలు చేశారు. రోజా బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిందని సీడీలు చూపించింది మర్చిపోయావా బాబు అన్నారు రోజా. విధి ఎవరినీ విడిచిపెట్టదన్నారు. 72 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ ని ఎంతగా ఏడిపించావో గుర్తుందా? 71 ఏళ్ళ 7 నెలలకే నీకా పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే మనకి అదే పరిస్థితి వస్తుందని. నీ…
ప్రతిపక్షం కోరిక మేరకే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఇవాళ సభలో జరిగింది దురదృష్ట సంఘటన అనాలో…ప్రజలకు అదృష్టం అనాలో ప్రజలే నిర్ణయించాలి. శాసనసభకు మళ్లీ రాను అని శపథం చేసి వెళ్ళిపోయారు. ఆయన ఎందుకు వెళ్ళారో మాకు ఎవరికీ అర్థం కాలేదన్నారు అంబటి రాంబాబు. చంద్రబాబు ఏడ్చే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. నేను కానీ, మా ఇతర సభ్యులు కానీ చంద్రబాబు భార్యను పల్లెత్తు మాట అనలేదు. మేము తప్పుగా మాట్లాడితే…
ఏపీ అసెంబ్లీలో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనపై ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రస్తావించారు. తాను సభలోకి వచ్చే సమయంలో చంద్రబాబు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారని, చంద్రబాబు సంబంధం లేని విషయాలు తీసుకువచ్చి రెచ్చగొట్టారని జగన్ ఆరోపించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు.…
భారీ వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో సచివాలయంలో వర్ష బాధిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సూచనలు చేశారు. ఈ సందర్భంగా వర్షాలపై సీఎంకు అధికారులు వివరాలు అందజేశారు. గతంలో వాయుగుండం కారణంగా భారీవర్షాలు కురిశాయని, ఇప్పుడు కూడా తీవ్ర వాయుగుండం కారణంగా కూడా భారీవర్షాలు కురుస్తున్నాయని, ప్రస్తుతం వాయుగుండం తమిళనాడులో తీరం దాటిందని అన్నారు. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు,…
మొదటి రోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందు మాట్లాడిన సీఎం జగన్, సమావేశం ముగిసిన తర్వాత మరోసారి జిల్లా కలెక్టర్లతో వర్షాల పరిస్థితులపై సమీక్షించారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్షించిన సీఎం జగన్ వారికి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాల, ప్రభావాన్ని అడిగి తెలుసు కున్నారు. సీఎం జగన్.రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తు తగిన చర్యలు తీసుకోవా లన్నారు. అవసర మైన చోట వెంటనే సహాయక…
చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలో కుండపోత వర్షాలతో జన జీవనం అస్తవ్యవస్తమయింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు తిరుపతిలోని ఘాట్ రోడ్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో టీటీడీ అధికా రులు రోడ్లను మూసివేశారు. ప్రధాన కూడళ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చెన్నైకి ఆగ్నేయంగా 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, కడపలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తగిన సహాయక చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశించారు. సహాయ శిబిరాల్లో…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం కారణంగా తమిళనాడుతో పాటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన క్రమంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశించారు. భారీ వర్షాలతో ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షపు నీరు…