అధికార వైసీపీ పై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ .. జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఇప్పుడు జగన్ చేసిన పనులు తప్పు అయినందునే చట్టాలు చెల్లవని హైకోర్టులో వీగిపోయే పరిస్థితి ఉన్నందునే కొత్త డ్రామాలకు జగన్ తెర లేపారన్నారు. అందుకే అసెంబ్లీ లో మూడు రాజధానుల చట్టం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. తాత్కాలిక ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే సరికాదని…
మూడు రాజధానులపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం జగన్ అసెంబ్లీ ప్రకటన చేశారు. కొన్ని మార్పులతో మళ్లీ తీసుకువస్తామని చెప్పారు సీఎం జగన్. అసలు అసెంబ్లీ లో సీఎం జగన్ ఏం మాట్లాడారంటే… 1953 నుంచి 1956 వరకు ఆంధ్రరాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. ఆరోజుల్లో గుంటూరులో హైకోర్టు ఉండేదన్నారు. ఆ తర్వాత 1956లో కర్నూలు నుంచి రాజధానిని కానీ, గుంటూరు నుంచి హైకోర్టును హైదరాబాద్‌కు ఏ రకంగా తీసుకుని పోయారు, తీసుకుని…
అమరావతి : రాజధాని చట్టాల ఉప సంహరణ తాత్కాలికమేనని స్పష్టం చేశారు సీఎం జగన్. మళ్లీ మెరుగ్గా బిల్లు సిద్దం చేసి వికేంద్రీకరణ విషయంలో ముందుకు వెళతామని చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని అన్ని వర్గాలకు వివరించేందుకు.. బిల్లులు మరింత మెరుగు పరిచేందుకు ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నామని వెల్లడించారు. అన్ని ప్రాంతాలకు వివరించేందుకు గతంలో చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకున్నామని… మళ్లీ సమగ్ర, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుందని పేర్కొన్నారు. విశాల ప్రజా ప్రయోజనాల కోసమే…
ఏపీలో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఏపీలో కురిసిన భారీ వర్షాలపై మాట్లాడారు. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయని, చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉందన్నారు. వరదలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారులకు ప్రత్యేక సూచనలు చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు వరదల్లో 34 మంది మృతి చెందారని, 10 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. మృతి చెందిన…
ఏపీలో 3 రాజధానుల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. జగన్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. దీంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పలు అంశాలపై ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పించింది. అంతేకాకుండా నేటికి విచారణను వాయిదా వేసింది. దీంతో నేడు విచారణకు హజరైన అడ్వకేట్ జనరల్ 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ఉన్నత న్యాయస్థానానికి వెల్లడించారు. ఈ విషయంపై అత్యవసరంగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో చర్చించి 3…
3 రాజధానుల అంశం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో మూడు రాజధానులు చేస్తామంటూ జగన్ సర్కార్ ప్రకటించడంతో పాటు అసెంబ్లీలో చట్టం చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరుపున హజరైన అడ్వకేట్ జనరల్ 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటునట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ పరిణామాల్లో మార్పు చోటు చేసుకుంది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి..…
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడు రాజధానుల అంశం నేడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మూడు రాజధానుల అంశాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అవడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. మూడు రాజధానుల అంశంపై వాదోపవాదాలు విన్న హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ రోజు మళ్లీ హైకోర్టు ఈ విషయంపై విచారణ చేపట్టడంతో మూడు రాజధానులు అంశాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. దీనిపై అసెంబ్లీలో కూడా…
మూడురాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవడంపై అమరావతి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముందునుంచీ అమరావతికి తన మద్దతు ప్రకటించి, రాజధాని రైతులకు బాసటగా నిలిచారు నరసాపురం ఎంపీ రఘురామ. తాజా నిర్ణయంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు సాధించిన విజయం. అవిశ్రాంతంగా పోరాటం చేసిన అమరావతి రైతులు, రైతు సోదరులకు, పర్యవేక్షణ కమిటీ నిర్వాహకులకు మహిళా సంఘాలు, సమర్ధించిన అందరికీ చెందుతుంది. అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం జరిగిన…
ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న మూడురాజధానుల అంశం కీలక మలుపు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని న్యాయస్ధానానికి అడ్వకేట్ జనరల్ తెలిపారు. మూడు రాజధానులు బిల్లు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది. నేటి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహటించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో అత్యవసర కేబినెట్ సమావేశం జరుగుతోంది. మూడు…
రాయల చెరువు గండిపై ఏపీ సీఎం జగన్ ఆరా తీశారు. సీఎంకు చెరువు పరిస్దితిని వివరించారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ ఘటన స్దానంలో పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించిన సీఎం… అత్యవసర సమయంలో ప్రజలను కాపాడటానికి రంగంలోకి మూడు హెలికాప్టర్స్ ను దించారు. ప్రజలు ప్రాణాలకు హానీ కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు జగన్. అయితే తిరుపతి, చంద్రగరిని వణికిస్తున్న రాయల్ చెరువు సమీపంలో… మరోసారి వర్షపు చినుకులు పడుతుండటంతో ఆందోళనలో స్దానికులు…అధికారులు ఉన్నారు.…