ఏపీ సీఎం జగన్ తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. సరస్వతి నగర్‌లో జగన్ బాధితులతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో తిరుపతి కార్పొరేషన్ సరస్వతి నగర్ లో సీఎం వైయస్ జగన్ ను కలిశారు కిడ్నీ పేషెంట్ బి కుసుమ కుటుంబ సభ్యులు. నడవడానికి ఇబ్బంది పడుతున్న కుసుమ పరిస్థితి చూసి తానే స్వయంగా వాళ్ళ ఇంటిలోనికి వెళ్లిన సీఎం ఆమెకు ధైర్యం చెప్పారు.…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టు కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరారు జగన్. తన బదులు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ కోరిన సంగతి తెలిసిందే. హాజరు మినహాయింపు ఇచ్చేందుకు గతేడాది నిరాకరించింది సీబీఐ కోర్టు. సీబీఐ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గతేడాది హైకోర్టును ఆశ్రయించారు జగన్. జగన్ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టారు జస్టిస్ ఉజ్జల్ భూయాన్. సీఎంగా…
ఓటీఎస్ పేరుతో పేద ప్రజలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చాయి. రూ. 6 వేల కోట్ల దోపిడీ లక్ష్యంగా ఓటీఎస్ అమలుకు ప్రయత్నం చేస్తుంది. డ్వాక్రా గ్రూపుల నుంచి మహిళ పొదుపు సొమ్ము కూడా బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటుంది.జగనన్న కాలనీలను అభివృద్ధి చెయ్యడం చేతకాని ప్రభుత్వం .. పేదలను ఓటీఎస్ పేరుతో పీడిస్తుంది. ఆంధ్రప్రదేశును అమ్మకానికి పెట్టారు..…
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లింది ఎందుకంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ఫోటోను షేర్ చేశారు. ‘ముఖ్యమంత్రి గారూ… మీరు వెళ్లింది మీ ఇసుక మాఫియాల కోసం జలసమాధి అయిపోయిన 60 మంది కుటుంబసభ్యులను పరామర్శించడానికి. మీ వంధిమాగదులతో సెల్ఫీలు తీసుకోవడానికి కాదు’ అని లోకేష్ ఆరోపించారు. ‘మీరు వెళ్లింది..…
✍ నేడు తిరుపతితో పాటు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన… వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, పంటలను పరిశీలించనున్న సీఎం జగన్✍ అమరావతి: నేడు టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం, దర్శి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చ✍ అమరావతి: నేడు మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్, హాజరుకావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం, పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలపై చర్చ✍ నేడు 33వ రోజుకు చేరిన అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర… నెల్లూరు…
మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో ఏపీలోని పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చి సహాయక చర్యలు అందించారు. వాగులు, వంకలు పొంగిపొర్లి వరద నీరు గ్రామాల్లోకి చేరింది. అంతేకాకుండా చెరువులకు గండ్లు పడడంతో కట్ట కింద ఉన్న పంటపొలాలు కొట్టుకుపోయాయి. పశువులు కూడా కొట్టుకుపోయి తీవ్ర ఆస్తినష్ట, ప్రాణ నష్టం కూడా సంభవించింది. దీంతో సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు,…
అమరావతి : సీఎం జగన్ రెండున్నరేళ్ల పాలనపై సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. రెండున్నరేళ్ల పాలనలో సీఎం జగన్ దళితులను అన్ని విధాల వంచించారని లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య. 30 నెలల పాలనలో 29 ఎస్సీ, ఎస్టీ పథకాలను రద్దుచేసి రూ.26,663 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించారని నిప్పులు చెరిగారు వర్ల రామయ్య. దారి మళ్లిన సబ్ ప్లాన్ నిధులను తిరిగి ఎస్సీ,…
క్రిస్మస్, సంక్రాంతి పండగల దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు గడువు ను పొడిగించింది. దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ గడువును పొడిగించింది. ప్రస్తుతం 30 రోజుల ముందు మాత్రమే ముందస్తు రిజర్వేషన్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఇవాళ్టి నుంచీ ఈ గడువును 60 రోజులకు పొడిగిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి…
ఇవాళ రాయలసీమ జిల్లాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలైన వైయస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ ఇవాళ, రేపు పర్యటించనున్నారు. ఇవాళ వైయస్సార్ కడప, చిత్తూరు జిల్లాలలో పర్యటించి నేరుగా బాధిత ప్రజలు, రైతులతో సీఎం ఇంటరాక్ట్ కానున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యం లో భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు. అంతేకాదు… ప్రాజెక్టు పరిసర గ్రామాల…
వరద ప్రభావిత ప్రాంతాలైన వైయస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్ రేపు, ఎల్లుండి పర్యటించనున్నారు. తొలిరోజు వైయస్సార్ కడప, చిత్తూరు జిల్లాలలో పర్యటించి నేరుగా బాధిత ప్రజలు, రైతులతో సీఎం ఇంటరాక్ట్ కానున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును సీఎం పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలతో వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా ప్రజలతో సీఎం ముచ్చటిస్తారు. మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన…