ఏపీలోని జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై ఈనెల 7 నుంచి ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నింటిపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. వీటిని ఏ పేరుతోనైనా తయారు చేయడం అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ…
విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. ఈ నెల 10న బెంజ్ సర్కిల్ రెండో ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ కార్యకమానికి సీఎం జగన్, ఇతర మంత్రులు హాజరవుతారు. దీంతో రెండో ఫ్లై ఓవర్ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు రహదారుల శాఖ మంత్రి శంకరనారాయణ, అధికారులు. ఈనెల 10న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 16వేల 500 కోట్లతో 1045 కిలోమీటర్లు…
పీఆర్సీ విషయంలో తమ డిమాండ్లు నెరవేర్చాని కోరుతూ మంగళవారం నుంచి ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. అయితే ఉద్యోగ సంఘాలు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. ఈ మేరకు తాము సమ్మెలో పాల్గొనడం లేదని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రవికుమార్ ప్రకటించారు.. రేపటి నుంచి ఉమ్మడి జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం పాల్గొనటం లేదని స్పష్టం చేశారు. పది…
టీడీపీ అధినేత చంద్రబాబు డా.బీఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్బంగా నివాళులు అర్పించారు. అంతేకాకుండా రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయంటూ వైసీపీ ప్రభుత్వ ఆ హక్కులను కాలరాస్తుందని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా ఓటీఎస్ పేరుతో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఉరి వేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు మాటలకు కౌంటర్ గా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పెట్రోల్, డీజీల్ సరఫరా చేయలేమని ఏపీ పెట్రోలియం ట్యాంక్ ఆపరేటర్స్ అసోషియన్ అధ్యక్షడు వై.వి ఈశ్వర రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు 125 ట్రక్కుల ద్వారా 160 బంకులకు పెట్రోల్, డీజీల్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ టెండర్లు వేసిందన్నారు. ఈ టెండర్లలో పశ్చిమ, తూర్పు గోదావరి నుంచి ఒక్కరంటే ఒక్కరూ పాల్గొనలేదని ఆయన…
అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి వెల్లంపల్లి అన్నారు. విజయవాడలో… మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్య లక్ష్మి, దేవినేని అవినాష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వెల్లంపల్లి మాట్లాడుతూ… అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించామన్నారు. ఆయన రాజ్యాంగం నేటికి అమలవుతుందంటే అంబేద్కర్ గొప్ప తనం అర్ధమవుతుందని కొనియాడారు. అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తూ… అందరి అభిమానాన్ని పొందుతున్నారన్నారు.…
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి, ఉద్యోగులకు పీఆర్సీ ఇతర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.. తాజగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఏపీ ఎన్‌జీవో రాష్ర్ట అధ్యక్షుడు బండి శ్రీనివాసులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల ఉద్యమానికి ఎవరైనా తలవంచాల్సిందేనని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా తమ చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. రాష్ర్ట వ్యాప్తంగా 13లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఒక్కో ఇంట్లో 5 ఓట్లు ఉంటాయని…
ఏపీలో వన్ టైం సెటిల్మెంట్ పథకంపై ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో అవగాహన కార్యక్రమాల పై ఫోకస్ చేసింది వైసీపీ. వన్ టైం సెటిల్మెంట్ పథకం పై పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సజ్జల ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సమావేశానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి హాజరయ్యారు. పేదలకు లబ్ది జరక్కుండా అపోహలు కల్గించి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలపై సజ్జల విరుచుకుపడ్డారు. ఓటిఎస్ పధకంపై…
ఈనెల ఏడవ తేదీ నుంచి ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను ఉద్యోగులు అందరూ విజయవంతం చేయాలి అని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. మేము దాచుకున్న, మాకు హక్కుగా రావాల్సిన డబ్బులు కొంతకాలంగా రావడం లేదు. గతంలో ముఖ్యమంత్రి చెప్పిన హామీలు నెరవేరడం లేదు అన్నారు. పీఆర్సీ నివేదిక లో ఉన్న అంశాలు కమిటీ సభ్యులు తెలిసినట్లు లేదు. పీఆర్సీ లో ఫిట్మెంట్ అంశం ఒక్కటే కాదు.. ఉద్యోగులకు సంబంధించిన చాలా అంశాలు ముడిపడి ఉంటాయి.…