ఇవాళ రాయలసీమ జిల్లాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలైన వైయస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ ఇవాళ, రేపు పర్యటించనున్నారు. ఇవాళ వైయస్సార్ కడప, చిత్తూరు జిల్లాలలో పర్యటించి నేరుగా బాధిత ప్రజలు, రైతులతో సీఎం ఇంటరాక్ట్ కానున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఈ నేపథ్యం లో భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు. అంతేకాదు… ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలతో వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా ప్రజలతో సీఎం ముచ్చటిస్తారు. మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన తిరుపతిలోనూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఇక రేపటి రోజున చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో… అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.