చంద్రబాబు, సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబు స్టిక్కర్ బాబుగా మారాడు…ఇప్పుడు జగన్ డబుల్ స్టిక్కర్ స్టిక్కర్ ముఖ్యమంత్రి గా తయారయ్యారని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన ప్రధాన మంత్రి ఆవాస్ పథకానికి జగన్ పేరు పెట్టుకోవడమేంటో అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 36 పథకాలకు జగన్ పేరు పెట్టారని ఆగ్రహించారు. అంబేద్కర్ నడయాడిన ప్రాంతాన్ని పంచ తీర్ధాలు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కె.రోశయ్య ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. రోశయ్య మృతిపట్ల రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోశయ్య కుమారుడికి ఏపీ సీఎం జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. అంతేకాకుండా రోశయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో రోశయ్యది ఆదర్శప్రాయమైన జీవితమని, ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని సీఎం జగన్ పేర్కొన్నారు. రోశయ్య మృతిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే…
ఏపీలో జగన్ పాలనపై బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. వైసీపీకి ఎందుకు ఓటేశామని లెంపలేసుకుంటున్న పరిస్థితి వుందన్నారు ఎంపీ సుజనా చౌదరి. అప్రజాస్వామికంగానే అధికార పార్టీ స్థానిక సంస్థలను చేజిక్కించుకుంది.ఏ ఒక్క మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. జగన్ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో ప్రజలకు అర్ధమైంది. తమకు బీజేపీ ఆశీస్సులున్నాయని వైసీపీలో కొందరు నేతలు చెప్పుకుంటున్నారు.. అదంతా అబద్దం. వైసీపీ మాకు శత్రువు కాదు కానీ.. రాజకీయ ప్రత్యర్ధి అన్నారు సుజనా చౌదరి.…
ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్రమంత్రి కూడా ప్రస్తావించారని ఆయన గుర్తుచేశారు. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ జవాబుదారీతనం గురించే కేంద్రమంత్రి ప్రశ్నించారని చంద్రబాబు తెలిపారు. జగన్ సీఎం అయినంత మాత్రాన జవాబుదారీతనానికి అతీతుడా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి ఒళ్లంతా ఇగోనే అని.. చెప్పినా అర్థం కాదని ఎద్దేవా చేశారు. జగన్…
ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడం, నిధుల గోల్‌మాల్ అంశాలపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర పథకాల పేర్లను జగన్ సర్కారు తమకు ఇష్టం వచ్చినట్లు మార్చడం సరికాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేంద్రం ప్రవేశపెట్టిన పోషణ్ అభియాన్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్, ఇంటిగ్రేటెడ్ ఛైల్మ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ పేర్లను పథకాలకు జగనన్న గోరుముద్ద, జగనన్న పాలవెల్లువ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణగా…
పీఆర్సీ నివేదిక కోసం కొద్ది రోజులుగా ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం జగన్ ఝలక్ ఇచ్చారా? రచ్చ చేస్తున్నవారితో చర్చించకుండానే.. కీలక ప్రకటన చేసేశారా? ఆ ప్రకటన తమవల్లే సాధ్యమైందని ఉద్యోగ సంఘాల నాయకులు కాలర్ ఎగరేసుకోకుండా సీఎం స్ట్రాంగ్ స్ట్రోక్ ఇచ్చారా? పీఆర్సీపై తిరుపతి పర్యటనలో సీఎం జగన్ కీలక ప్రకటన..! తాడో పేడో తేల్చుకుంటాం..! ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు..! పీఆర్సీ నివేదిక ప్రకటిస్తారా లేదా అని రోడ్డెక్కి కార్యాచరణ…
ఉత్తరాంధ్రలో జవాద్ తుపాన్ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదని.. ఒక్క మరణం కూడా సంభవించొద్దని పేర్కొన్నారు. ఆ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలని… సహాయ చర్యల్లో…
ఉత్తరాంధ్రలో జవాద్ తుఫాన్ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, ఇతర ఉన్నతస్థాయి అధికారులు హాజరయ్యారు. జగన్ మాట్లాడుతూ అధికారులకు సూచనలు చేశారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత…