ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఏపీ సీఎంతో సమావేశం నిర్వహించింది. అనంతరం కేంద్రం బృందం సభ్యుడు కునాల్ సత్యార్థి మాట్లాడుతూ.. కేంద్ర బృందం తరుపున వివరాలను సీఎం జగన్‌కు సమర్పించినట్లు తెలిపారు. అంతేకాకుండా వరద ప్రభావం వల్ల కడప జిల్లాలో భారీ నష్టం జరిగిందన్నారు. పంటలు, పశువులు కొట్టుకుపోయాయని, అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిన చోట అపార నష్టం…
పెదగంట్యాడ మండలం గంగవరంలో వెలసిన పెద అమ్మవారు ఆలయంలో కపిలేశ్వరానందగిరి స్వామీజీ నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల కో కన్వీనర్ సునీల్ థియోధర్. అక్కడ ఆయన మాట్లాడుతూ… ఏపీ ప్రభుత్వంలో అవినీతి కారణంగా మత్స్యకారులకు కేంద్రం అమలు చేస్తున్న పథకాలు పూర్తిస్థాయిలో చేరడం లేదన్నారు. నెల్లూరు ప్రాంతంలో డీఎంకే అండ ఉన్న తమిళనాడు ఫిషింగ్ మాఫియా మత్స్యకారుల వలలను నాశనం చేస్తోంది. ఇందులో వైసీపీ నాయకుల పాత్ర ఉంది అని ఆరోపించారు. మత్స్యకారుల సంక్షేమం…
సీఎం జగన్‌కి బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు బహిరంగ లేఖ. ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తానన్న ప్రొత్సహాకాలను ఎందుకివ్వడం లేదని లేఖలో ప్రశ్నించారు సోము వీర్రాజు. పంచాయతీ నిధులకు పారదర్శకత ఏది..? ఏకగ్రీవ పంచాయతీ పాలక మండళ్ళకు ప్రోత్సాహక నగదు ఏది..? అంటూ తన లేఖలో ప్రశ్నలు సంధించారు సోము వీర్రాజు. జీవో విడుదల చేసి నవ మాసాలు నిండినా అమలు చేయరా..? అని అన్నారు. పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే గతంలో వేలల్లో ఉండే ప్రోత్సాహకాన్ని లక్షల్లోకి…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. చర్చిలకు ఎంపీ లాడ్స్ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. సీఎస్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం లేఖలు పంపించింది. పీఎంవోకు ఇవ్వాల్సి ఉన్నందున తక్షణమే నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సూచించింది. Read Also: రెండు దశాబ్దాలుగా నరసరావుపేటలో టీడీపీ డల్..! గతంలోనే ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై ఏపీ సర్కారు…
ఏపీ సర్కారుపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదని… ఉన్న పరిశ్రమలు రాష్ట్రానికి బై చెప్తున్నాయని లోకేష్ ఆరోపించారు. టాటా గ్రూప్ 300 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సెమీకండక్టర్ పరిశ్రమను తెలంగాణ లేదా తమిళనాడు రాష్ట్రానికి తరలించాలని యోచిస్తోందన్నారు. లులూ గ్రూప్ కూడా ఏపీకి రాకూడదని నిర్ణయించుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయని లోకేష్ వివరించారు. Read Also:…
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై ఆయన నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో ఇకపై అసెంబ్లీలోకి సభ్యులెవ్వరూ మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. ఇటీవల సభలో చంద్రబాబు మైక్ కట్ చేసిన సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతుండగా కొందరు టీడీపీ సభ్యులు ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఏపీ స్పీకర్ సభలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించినట్లు…
మైనారిటీలకు కూడా అత్యున్నత పదవులు లభిస్తాయని జగన్ మరోసారి నిరూపించారు. ఏపీ శాసన మండలిలో ఓ ముస్లిం మహిళకు డిప్యూటీ ఛైర్ పర్సన్ పదవి కట్టబెట్టారు. శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్.జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కాసేపు జగన్ తో ముచ్చటించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా తనను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి వైయస్.జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ జకియా ఖానమ్. ఈ సందర్భంగా సీఎం…
ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సభ ముందుకు రానుంది కాగ్ నివేదిక. మరోవైపు అసెంబ్లీలో సభ్యుల ఫోన్ల అనుమతికి చెక్ చెప్పారు. సభలో సభ్యులు ఫోన్లు తీసుకుని రావడానికి ఇక నుంచి అనుమతి లేదని హౌస్ లో ప్రకటించారు స్పీకర్ తమ్మినేని. చంద్రబాబు ఎపిసోడ్ సమయంలో టీడీపీ సభ్యులు సభలో వీడియో రికార్డు చేయడం వివాదాస్పదమైన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు.
మాజీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మంత్రి పేర్ని నాని. ప్రభుత్వంలో లోపాలు చూపితే సరి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు మంత్రి పేర్ని నాని. వరద బాధితుల దగ్గరకెళ్లి మీ ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు.మా ఆవిడను తిట్టారని వాళ్ళ దగ్గర ఏడుపు ఎందుకు..? మీ శ్రీమతి గారిని మేము ఏమీ అనలేదని లబోదిబోమంటున్నాం. నిన్ను తిడతాం గానీ…మీ ఇంట్లో వాళ్ళను ఎందుకు తిడతాం. టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబు ను చీదరించుకుంటున్నారు. మాకూ కుటుంబ సభ్యులున్నారు..మా…
ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వారికి సీఎం జగన్ శుభవార్త అందించారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని అసెంబ్లీలో ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం ఆరోగ్య రంగం అభివృద్ధిపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వమని.. ప్రతి ఒక్కరి ప్రాణాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగన్ తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని…