ఏపీలో అసలేం జరుగుతోంది? గత కొంతకాలంగా కాపు నేతలు భేటీల మీద భేటీలు కావడం వెనుక ఆంతర్యం అదేనా? రాజకీయంగా వత్తిడి పెంచేందుకు ఒక వేదిక అవసరం అని భావిస్తున్నారా? తాజాగా విశాఖలో జరిగిన కాపు నేతల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ పేరుతో ఒక సంస్థ ఆవిర్భావం జరిగిందని మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు ప్రకటించారు. ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు…
ఏపీలో కొత్త జిల్లాల్లో పాలనా వ్యవహారాలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. అందులో భాగంగా జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల కేటాయింపు, పోస్టుల విభజనకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. కొత్త జిల్లాల్లో ఈ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు ఆప్షన్ ఫార్మ్ లను జారీ చేసింది ప్రభుత్వం. వీటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్న సీఎస్ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి కమిటీ. ఏప్రిల్ 2 ఉగాది నాటి నుంచి కొత్త జిల్లాల్లోని పునర్వవస్థీకరించిన…
ఏపీలో వైసీపీ, టీడీపీ నేతలు ట్విట్టర్ వేదిక విమర్శలు గుప్పించుకుంటునే ఉన్నారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానంలో అడుగుపెట్టి 44 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు శుభాకాంక్షలు తెలుపుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అప్పట్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు… కొంగర పట్టాభిరామ చౌదరిపై నెగ్గారు. చంద్రబాబు ప్రజాప్రస్థానంపై టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఓ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.…
ఎన్టీఆర్ కేంద్రంగా కృష్ణా జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్టీఆర్ పేరు.. ఎన్టీఆర్ ఊరు అనే కాన్సెప్ట్‌తో వైసీపీ అడుగులు పడుతున్నాయి. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడుతున్నారు. తాజాగా నిమ్మకూరులో ఎన్టీఆర్ భారీ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం రాజకీయాల్లో చర్చగా మారింది. నిమ్మకూరులో ఎన్టీఆర్ భారీ విగ్రహానికి వైసీపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్NTR.. కృష్ణా జిల్లాలో ఈ పేరు చుట్టూనే రాజకీయం జరుగుతోంది. ఎన్టీఆర్‌ను ఎవరికి వారు ఓన్ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.…
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ పట్ల ఏపీ ప్రభుత్వం కనపరుస్తున్న తీరు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘రాష్ట్రంలో పేదవాడికి ఉన్న ఏకైక వినోదం సినిమా.. ఆ సినిమా పరిశ్రమను కూడా వివాదాస్పదం చేసి వినోదం చూస్తున్నారా ముఖ్యమంత్రి గారూ’ అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. సినిమాకు కూడా కులగజ్జి అంటించి తమాషా చూస్తున్నారని…
సీఎం వైఎస్ జగన్ ను సినిమా నటుడు పోసాని కృష్ణ మురళి గురువారం తాడేపల్లిలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా కుటుంబం కరోనాతో బాధపడుతున్న సమయంలో సీఎం, ఆయన సతీమణి మాట సాయం చేశారని, ఏఐజి ఆసుపత్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. అందుకే సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్జతలు తెలిపానని ఆయన వెల్లడించారు. సినిమా టికెట్ల ధరల పెంపు పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, చిన్న…
మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు రోజూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. వివేకా కేసులో కథలు అల్లి జగన్ ను ఎలా ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎటువంటి అంశాలపైనైనా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. చివరికి గౌతమ్ రెడ్డి మరణంపై కూడా నీచంగా మాట్లాడే సంస్కృతి వారిది. రోజూ ఏదో ఒక బురద జల్లాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వివేకా హత్య కేసులో మేము అడిగిన నాలుగు ప్రశ్నలకు…
ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు. టీడీపీ సమస్యలని ప్రస్తావిస్తే.. వైసీపీ బూతులు తిడుతుంది. బూతులు తిట్టడం నాకు రాదు. ప్రత్యర్ధులు బూతులు తిడితే టీడీపీ కూడా తిట్టాల్సిన అవసరం లేదు.సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన లక్ష్యంగా పని చేయాలని టీడీపీ కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో వ్యవస్థలను నాశనం చేశారు.నా గవర్నమెంటు నా ఇష్టం అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు.సొంత బాబాయిని హత్య చేయించిన వాళ్లకే జగన్ అండగా ఉంటున్నారు. వివేకా…
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఇంకా స్పష్టత నెలకొనలేదు. దీంతో తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్నా సినిమాలపై భారం పడే అవకాశం ఉంది. అయితే ఈనెల 25న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ.. ఏపీలో జీవో 35 ప్రకారమే సినిమా టికెట్‌లు విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ సినిమాలపై కక్ష సాధింపులకు…
రాజమండ్రిలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీలు, ఆశావర్కర్ల ఆందోళనలపై ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ పేదల పక్షపాతి వారి ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వంపై ఈర్ష్యతో ప్రతిపక్షాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాయి. గతంలో అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది. ఎన్నికలకు ముందు అంగన్వాడీ వర్కర్లకు ఏడు వేల రూపాయల జీతం వచ్చేది. సీఎం…