ఆ ప్రాంతంలో జిల్లా విభజనపై ఒక రేంజ్‌లో ఉద్యమం జరుగుతుంటే.. ఒక మంత్రి.. ప్రతిపక్షపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మాత్రం సైలెంట్ అయ్యారు. మొన్నటి వరకు మాకు ఓటేయండి.. మన ఊరిని జిల్లా కేంద్రం చేయిస్తామని హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. నేతలను కదిపితే నోకామెంట్ అంటున్నారట. ఆ ప్రాంత నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? మున్సిపల్ ఎన్నికల్లో పెనుకొండే ప్రచార అస్త్రం అనంతలో జిల్లాల విభజనపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా…
నేడు సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్‌లో సమావేశం కానున్నారు. సమావేశానికి హజరుకావాలని 240 మంది సభ్యులకు ఆహ్వానం పంపించారు. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ తర్వాత తొలిసారి సమావేశం కానున్నారు. నేడు సీఎం కేసీఆర్ ముంబైకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను సీఎం కేసీఆర్ కలువనున్నారు.…
జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడి చింతా అనంతలక్ష్మీ పూరింటిని కూల్చివేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రాత్రికి రాత్రి 200 మంది రౌడీ మూకలతో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న అనంతలక్ష్మీ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ…
టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఒక అలవాటుగా మారి మాటల దాడి చేస్తున్నారు. ఏదో విధంగా , ఏవేవో కధనాలు రాసి వాటి పైన ప్రతి పక్షాలు విమర్శలు చేస్తూ ప్రజల్లో అసంతృప్తి రేకెత్తిస్తున్నారు. ప్రజల్లో రాజకీయ లబ్ది పొందడం కోసమే దిశగా ప్రవరిస్తున్నారు. ఎన్టీపీసీకి …ప్రభుత్వానికి కొంత గేప్ వచ్చింది. రెండు రోజులు పాటు ఇబ్బందులు వచ్చాయి. లేదని నేను చెప్పలేదన్నారు బొత్స. సమస్య అయిపోయిన తరవాత…
తనను డీజీపీగా ఎంపికచేసి చాలా పెద్ద బాధ్యత అప్పగించారన్నారు కే.రాజేంద్రనాథ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. తన పై ఇంత నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి జగన్ కి ధన్యవాదాలు. జిల్లా స్థాయి పోలీసు అధికారులు కూడా గురుతర బాధ్యత వహించాల్సి ఉంటుంది. కింది స్థాయి సిబ్బందికి ఆ విధంగా దిశానిర్దేశం చేయాలి. ప్రజలకు పోలీసుల పై భారీ అంచనాలు ఉంటాయి. ప్రజల ధనప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు డీజీపీ.…
ఏపీ ప్రభుత్వం ఇటీవల డీజీపీ ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు బదిలీపై వెళుతున్న గౌతమ్ సవాంగ్‌కు పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 36 ఏళ్ళ నా పోలీసు సర్వీస్ ముగింపుకు వచ్చిందని ఆయన అన్నారు. రెండేళ్ళ 8 నెలల పాటు రాష్ట్ర డీజీపీగా పని చేసే అవకాశం ముఖ్యమంత్రి ఇచ్చారని, అందుకు సీఎం కు కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. సీఎం ఆదేశాలకు…
ఇటీవల ఏపీ ప్రభుత్వం డీజీపీగా ఉన్న సవాంగ్‌ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు ఏపీకి నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా పై నమ్మకం ఉంచి డీజీపీగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలని ఆయన వెల్లడించారు. నాపై ఉన్న నమ్మకాన్ని మరింత నిలబెట్టుకునే విధంగా పని చేస్తానన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఆకాంక్షలు ఉంటాయని, ఏదైనా మారుమూల ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ తప్పు చేసినా…
శ్రీశైలంలో నేడు మూడో రోజు శ్రీమల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం కొనసాగనుంది. ఈ నెల 21 వరకు మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం కొనసాగనుంది. నేడు ఏపీ డీజీపీగా కె.వెంకటరాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు. ఇటీవల ఏపీ డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను ఎపీపీఎస్సీకి చైర్మన్‌గా బదిలీ చేసిన విషయం తెలిసిందే. నేడు ఇండోర్‌లో గోబర్ దాన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. నేడు గుజరాత్‌లో…
ఈనెల 20న ఆదివారం నాడు కడప, విశాఖ జిల్లాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ముందుగా కడప జిల్లాలో పర్యటించి సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ కడప చేరుకుంటారు. పుష్పగిరిలోని విట్రియో రెటీనా ఐ ఇన్ స్టిట్యూట్ ప్రారంభిస్తారు. అనంతరం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఆ…
విజయవాడ పర్యటనలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏపీ సీఎం జగన్‌ను మెచ్చుకోవడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సాధారణంగా మితభాషి అని.. ఆయనకు పొగడ్తలు అంటే గిట్టవు అని.. అందుకే ఆయన ఎవరినీ ప్రశంసించిన దాఖలాలు ఉండవని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అలాంటి నితిన్ గడ్కరీ జగన్‌ను మెచ్చుకోవడం మాములు విషయం కాదన్నారు. ఏదైనా సాధించగల గట్టి ఆశయాలు ఉన్న డైనమిక్ లీడర్ జగన్ అని నితిన్ గడ్కరీ మెచ్చుకోవడం…