విధాన పరమైన నిర్ణయాల అమల్లో సచివాలయ మహిళా ఉద్యోగులు క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వ సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. మంగళవారం ఉమెన్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరి ప్రభుత్వం వచ్చినా.. ఆ నిర్ణయాలు అమల్లో మీదే కీలక పాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ గత మూడేళ్లగా మహిళా సాధికారికతకి కృషి చేస్తున్నారని, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం అనేక ఏళ్లుగా పోరాటం జరుగుతుందని, ఏపీలో 50 శాతానికి పైగా మహిళలకి…
ఏపీ ఎన్జీఓ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగుల ప్రత్యేక సమస్యలు మాకు అర్ధమౌతాయని, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ పూర్తిస్థాయిలో వస్తుందని ఆమె వెల్లడించారు. ఇటీవల మహిళా ఉద్యోగులు డిప్రెషన్ కు లోనవుతున్నారని, మహిళలు బలంగా తయారవ్వాలని ఆమె కోరారు. గత ప్రభుత్వాలలో మహిళలకు జరిగిందేమిటని ఆమె ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగినదేమిటి మహిళలు గుర్తించాలని ఆమె…
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై స్పష్టట నెలకొంది. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ఉత్వర్వుల జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై టాలీవుడ్ సినీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిలిం చాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ. ఏపీ ప్రభుత్వం మా విన్నపాలను కొంత వరకు అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా మిగిలిన సమస్యలను కూడా త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని ఆయన అభిప్రాయం వ్యక్తం…
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు సీ. కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్, చదలవాడ శ్రీనివాస్ లు హజరయ్యారు. ఈ సందర్భంగా సీ. కల్యాణ్ మాట్లాడుతూ.. వివాదాలకు తెరదించుతూ ప్రభుత్వం టికెట్ ధరలపై జీవో ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినీ…
మహిళా సాధికారతకు అర్ధం చెప్పేలా ఇక్కడికి వచ్చిన మహిళలు అందరికీ శుభాకాంక్షలు. రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మలకు హ్యాపీ ఉమెన్స్ డే. ఆధునిక ఏపీ లో మహిళలకు దక్కిన గౌరవానికి రాష్ట్ర మహిళలందరూ ప్రతినిధులే. స్టేజి మీద కాదు …స్టేడియంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులే. ప్రతి ఒక్కరూ సాధికారతకు ప్రతినిధులుగా ఉన్న మహిళలే. మహిళా జనసంద్రం చూస్తుంటే ఐన్ రైన్డ్ అనే మహిళ మాటలు గుర్తొస్తున్నాయి. మహిళగా నన్ను ఎవరు గుర్తిస్తారన్నది కాదు.. ఆత్మవిశ్వాసం…
ఏపీ అసెంబ్లీలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంపై సీఎం జగన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా కోసం దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి కన్న కలలను తాము సాకారం చేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టి ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ప్రకటించారు. తన సహచరుడు, మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి లేడని ఊహించడం కష్టంగా ఉందని.. గౌతమ్…
ఏపీలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బుల చెల్లింపుల కోసం ప్రవేశపెట్టిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం వాయిదా పడింది. గతంలో ప్రకటించిన దాని ప్రకారం ఇవాళ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల డబ్బులు జమ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ పథకం వాయిదా పడటంతో ఈ రోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు పడే అవకాశాలు లేవు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం…
అసెంబ్లీలో సోమవారం నాటి పరిణామాలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించి ప్రసంగం ప్రతులను చించివేయడం సరికాదని బీఏసీ సమావేశంలో సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలని, అలాంటిది కాగితాలు చించి ఆయనపై విసరడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు వద్ద సీఎం…
ఏపీ ప్రభుత్వం టిక్కెట్ రేట్ల కు సంబంధించి కొత్తగా రూపొందించిన జీవో మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను చూసిన వారు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సీఎంను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్న తర్వాత ఇటు సాధారణ ప్రజలకు, సినిమా వాళ్ళకు సంతృప్తి కలిగే విధంగా టిక్కెట్ రేట్లను నిర్ణయిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే…