ఏపీ ఎన్జీఓ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగుల ప్రత్యేక సమస్యలు మాకు అర్ధమౌతాయని, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ పూర్తిస్థాయిలో వస్తుందని ఆమె వెల్లడించారు. ఇటీవల మహిళా ఉద్యోగులు డిప్రెషన్ కు లోనవుతున్నారని, మహిళలు బలంగా తయారవ్వాలని ఆమె కోరారు. గత ప్రభుత్వాలలో మహిళలకు జరిగిందేమిటని ఆమె ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వంలో జరిగినదేమిటి మహిళలు గుర్తించాలని ఆమె అన్నారు. రాజకీయాల్లో సైతం భార్యలను ముందుకు తీసుకొచ్చే భర్తలున్నారు అని ఆమె కొనియాడారు. మహిళల పాలన సమాజం జీర్ణించుకోవడం కష్టమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండడా మహిళా సాధికారతకు ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటోందని ఆమె అన్నారు. ఏపీ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని ఆమె అన్నారు.