ఏపీలో సినిమా టికెట్ల ధరలపై స్పష్టట నెలకొంది. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ఉత్వర్వుల జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై టాలీవుడ్ సినీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిలిం చాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ. ఏపీ ప్రభుత్వం మా విన్నపాలను కొంత వరకు అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా మిగిలిన సమస్యలను కూడా త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎన్నో సంవత్సరాల సమస్యకు పరిష్కారం చూపిందని, అపరిష్కృతంగా ఉన్న పెద్ద సమస్యను ప్రభుత్వం పరిష్కరించిందని ఆయన వ్యాఖ్యానించారు.
కొవిడ్ కన్నా జీవో 35తో డిస్ట్రిబ్యూటర్లు చాలా సతమతమయ్యారని, ఇప్పుడు విడుదల చేసిన జీవో మాకు చాలా సంతృప్తికరంగా ఉందని ఆయన అన్నారు. ఇదే జీవో భీమ్లానాయక్ ముందు వచ్చి ఉంటే మరింత పాజిటివ్ గా ఉండేదని, ఇంకా సినీ పరిశ్రమలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటాం ఆయన అన్నారు. సినీ పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి చిరంజీవి ముఖ్య భూమిక పోషించారని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఫ్రెండ్లీ ప్రభుత్వాలు అంటూ ఆయన మాట్లాడారు.