ఏపీలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బుల చెల్లింపుల కోసం ప్రవేశపెట్టిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం వాయిదా పడింది. గతంలో ప్రకటించిన దాని ప్రకారం ఇవాళ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల డబ్బులు జమ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ పథకం వాయిదా పడటంతో ఈ రోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు పడే అవకాశాలు లేవు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. ఈ కారణంగా జగనన్న విద్యా దీవెన పథకం తాత్కాలికంగా వాయిదా పడింది. కాగా జగనన్న విద్యా దీవెన పథకం అమలు కొత్త తేదీని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని అధికారులు తెలిపారు.